అనుపమ పరమేశ్వరన్‌ ప్రేమలో మోసపోయిందా? | - | Sakshi
Sakshi News home page

అది శుద్ధ అబద్ధం: అనుపమ పరమేశ్వరన్‌

Jan 17 2025 1:25 AM | Updated on Jan 17 2025 4:00 PM

తమిళసినిమా: మాలీవుడ్‌లో కంటే టాలీవుడ్‌ లోనే ఎక్కువ చిత్రాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌. ప్రేమవ్‌ు అనే చిత్రం ద్వారా ముగ్గురు కథానాయకిల్లో ఒకరిగా పరిచయమైన ఈమెను ఆ చిత్ర విజయం దక్షిణాది నటిగా మార్చేసింది. ఆ తర్వాత మాతృభాషలోనే కాకుండా తెలుగు, తమిళం భాషల్లోనూ అవకాశాలు వరుసగట్టాయి. అయితే ఎక్కువగా తెలుగులోనే ఈమె నటించిన చిత్రాలు సక్సెస్‌ కావడంతో అక్కడ స్టార్‌ ఇమేజ్‌ను సంపాదించుకుంది. 

ఇకపోతే డీజే టిల్లు చిత్రానికి ముందు వరకు పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అనుపమ పరమేశ్వరన్‌ ఆ చిత్రంలో అందాలను ఆరబోయడంతో పాటు లిప్‌లాక్‌ సన్నివేశాలలో నటించి తనలోని గ్లామర్‌ కోణాన్ని తెరపై విచ్చలవిడిగా ఆవిష్కరించింది. అయితే తమిళంలో ధనుష్‌ జంటగా కోడి చిత్రంతో కథానాయకిగా పరిచయం అయింది. కోలీవుడ్‌లో ఈ అమ్మడికి ఆశించిన విజయాలు రాలేదు. ఇటీవల జయం రవి సరసన నటించిన సైరన్‌ చిత్రం కూడా పూర్తిగా నిరాశపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో అనుపమ పరమేశ్వరన్‌ ఒక భేటీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

‘‘ఎప్పుడు నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పడం శుద్ధ అబద్ధం. అదేవిధంగా నువ్వే నా ప్రాణం నువ్వు లేక నేను లేను అనే ప్రేమలో చిక్కుకున్న వారు వెంటనే అందులోంచి బయటపడండి’’ అని నటి అనుపమ పరమేశ్వరన్‌ పేర్కొన్నారు. దీంతో అమ్మడు ప్రేమలో మోసపోయిందా? ఆ చేదు అనుభవంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందా? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement