క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 6 2026 8:31 AM | Updated on Mar 6 2026 8:31 AM

●వ్యక్తి దారుణ హత్య ●తండ్రి, కుమారుడు అరెస్టు

ప్రాణం తీసిన ఈత సరదా

అన్నానగర్‌: చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతిచెందారు. చైన్నెలోని ఐనావరం ప్రాంతానికి చెందిన సంజయ్‌ (12), ప్రవీణ్‌ (12) స్నేహితులు. వీరిద్దరూ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. ఈస్థితిలో గురువారం స్నేహితులు ఇద్దరు ఐసీఎఫ్‌ నార్త్‌ కాలనీ లేక్‌ వ్యూ ప్రాంతంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. చెరువులో ఈత కొడుతూ లోతైన ప్రాంతానికి వెళ్లి బురదలో కూరుకుపోయి మునిగిపోయారు. ఇది చూసిన సమీపంలోని కొంతమంది వెంటనే చెరువలోకి దిగి ఇద్దరిని బయటకు తీసి ఐసీఎఫ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఐసీఎఫ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

34 మంది సీఐల బదిలీలు

అన్నానగర్‌: చైన్నెలో 34 మంది సీఐలను బదిలీ చేస్తూ పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల విభాగంలో సీఐల బదిలీల వివరాలు..శాస్త్రినగర్‌కు రోహిణి, వాషర్‌మన్‌న్‌పేటకు రాజేష్‌ఖన్నా, థౌజండ్‌లైట్స్‌కు వేల్‌మణి, ఆనంద్‌ పోర్ట్‌కు శ్రీనివాసన్‌ లా అండ్‌ ఆర్డర్‌ సీఐలుగా నియమితులయ్యారు. రవిచంద్రన్‌ను వెప్పేరి, కన్నన్‌న్‌ను రాయపేట, రామసామి సేతుపట్టుకు, కుమరన్‌నగర్‌కు కృష్ణకుమార్‌, రాజ్‌ ప్రభును తేనాంపేట, సెంథిల్‌ మురుగన్‌ను నార్త్‌కోస్ట్‌కు బదిలీ అయ్యారు.

అవినీతి కేసులో మహిళా అధికారి అరెస్ట్‌

అన్నానగర్‌: అవినీతి కేసులో మహిళా అధికారి అరెస్ట్‌ అయ్యారు. విరుదునగర్‌ జిల్లాలోని అరుప్పుకోట్టై సొక్కలింగపురానికి చెందిన శాంతి (48). ఈమె లేబర్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌. ఈ స్థితిలో పందల్‌కుడికి చెందిన శంకరనారాయణన్‌ (50) నడుపుతున్న సూపర్‌ మార్కెట్‌కు ఫుడ్‌ ప్యాకేజ్‌ లైసెన్‌న్స్‌ పొందడానికి శాంతి రూ.15 వేలు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. లంచం ఇవ్వడానికి ఇష్టపడని శంకర్‌నారాయణ్‌ విరుదునగర్‌ ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ పోలీసుల సలహా మేరకు గురువారం శంకరనారాయన్‌ శాంతి కార్యాలయానికి వెళ్లి ఆమెకి రసాయనాలను పూసిన నగదును ఇచ్చాడు. ఆ సమయంలో, అక్కడే ఉన్న ఏసీబీ పోలీసులు శాంతిని రెడ్‌ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు.

పోలీస్‌స్టేషన్‌ను

దివ్యాంగుల ముట్టడి

తిరువొత్తియూరు: జేజే నగర్‌ పోలీస్‌స్టేషన్‌ను దివ్యాంగులు ముట్టడించారు. చైన్నె, పాడి, టీవీఎస్‌ నగర్‌కు చెందిన సూర్య. ఇతని భార్య సునీత. దివ్యాంగురాలైన నీమె మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై జె.జె.నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 30 మందికి పైగా దివ్యాంగులు జె.జె.నగర్‌ పోలీస్‌స్టేషన్‌న్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. సునీత మృతిపై అనుమానం ఉందని, న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫొటోలతో ప్రదర్శన నిర్వహించారు. హత్య కేసుగా నమోదు చేసి విచారించాలని కోరారు.

జన్యు లోపాలపై అవగాహన

వేలూరు: వేలూరు కార్పొరేషన్‌ పరిధిలోని కజింజూర్‌ ఎండీ స్కూల్‌లో జరిగిన ఉచిత వైద్యశిబరంలో జన్యు లోపంపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా వేలూరు డిప్యూటీ మేయర్‌ సునీల్‌కుమార్‌ చిన్నారుల్లో వచ్చే జన్యుపరమైన లోపాలపై అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. ముందస్తుగా గుర్తించాల్సిన అవసరాన్ని డాక్టర్‌ సెల్వకుమార్‌ వివరించారు. పుట్టినప్పుడు బొటనవేలు వంగడం ప్రధాన మొదటి లక్షణం. అటువంటి బాధిత పిల్లలను గుర్తించిన వారికి ఫాప్‌ స్వచ్ఛంద సంస్థ ద్వారా రూ.1000 బహుమతిని అందజేస్తూ, బాధిత పిల్లలకు వైద్యులు చికిత్స అందిస్తారు. సంఘం సభ్యులు కామరాజ్‌, నరసింహన్‌, గణేశ్వర్‌, శంకరన్‌, సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు. శిబిరాన్ని డివిజన్‌ కార్యదర్శి మైఖేల్‌ నిర్వహించారు.

ప్రాణం తీసిన

వివాహేతర సంబంధం

తిరువళ్లూరు: మహిళతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి హత్యకు గురయ్యాడు. హత్య చేసిన తండ్రి కొడుకును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం మాగరల్‌ ప్రాంతానికి చెందిన చిన్నప్పన్‌(50). ఇతను అదే ప్రాంతంలో దుకాణం నిర్వహిస్తున్నారు. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన సుభాష్‌ భార్య దేవితో వివాహుతర సంబంధం వున్నట్టు తెలిసింది. దీంతో చిన్నప్పన్‌ను సుభాష్‌ పలుమార్లు హెచ్చరించాడు. అయినా కొనసాగించడంతో ఆగ్రహించిన సుభాష్‌, అతని కుమారుడు శక్తివేల్‌(19) చిన్నప్పన్‌తో ఘర్షణ పడ్డారు. ఘర్షణలో శక్తివేలు, సుభాష్‌ చిన్నప్పన్‌ను హత్య చేసి పరారయ్యారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. పోలీసులు తండ్రీకుమారుడిని అరెస్ట్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement