మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్యకు గురయ్యాడా? | - | Sakshi
Sakshi News home page

మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్యకు గురయ్యాడా?

Nov 9 2024 1:09 AM | Updated on Nov 9 2024 1:57 PM

-

భార్య ప్రవర్తనపై మూర్తికి అనుమానం 

కొరుక్కుపేట: పెళ్లయిన ఆరు నెలలకే భార్య తీరుపై అనుమానంతో ఓ టైలర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. చైన్నెలోని వడపళని పిల్లియార్‌ కోయిల్‌ వీధికి చెందిన మూర్తి (41) టైలర్‌గా జీవనం చేసేవాడు. అతను 6 నెలల క్రితం తల్లిదండ్రుల అంగీకారంతో సత్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. సత్య వడపళనిలోని బుక్‌బైండింగ్‌ షాపులో పనిచేస్తోంది. పెళ్లి జరిగిన రోజు నుంచి సత్య తన స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడేవారు.. ఇది భర్త మూర్తికి నచ్చలేదు. సత్య ప్రవర్తనపై మూర్తికి అనుమానం వచ్చింది. దీంతో రోజూ పని ముగించుకుని తాగి ఇంటికి వచ్చేవాడు. 

ఎప్పటి లాగే గురువారం రాత్రి మూర్తి మద్యం తాగి వచ్చి భార్య ప్రవర్తనపై అనుమానం ఉందని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం చెందిన మూర్తి ఏం చేయాలో తెలియక కత్తెరతో పొడుచుకున్నాడు. కొద్దిసేపటికే రక్తస్రావం జరిగి స్పృహ తప్పి పడిపోయాడు. భార్య సత్య ఇరుగుపొరుగు వారు సహాయం కోసం 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. 

అంబులెన్స్‌ సిబ్బంది అక్కడి కి చేరుకుని మూర్తిని పరీక్షించగా, అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న వడపళని పోలీసులు మూర్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేకే నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతుడి భార్య సత్యను విచారిస్తున్నారు. మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్యకు గురయ్యాడా? అనేది పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే తేలనుందని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement