సినీ సహాయ నటీమణులతో వ్యభిచారం ఇద్దరు అరెస్ట్‌  | - | Sakshi
Sakshi News home page

సినీ సహాయ నటీమణులతో వ్యభిచారం ఇద్దరు అరెస్ట్‌ 

Sep 23 2023 12:34 AM | Updated on Sep 24 2023 4:58 PM

- - Sakshi

సినీ సహాయ నటీమణులను తీసుకువచ్చి  వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు బ్రోకర్లను పోలీసులు అరెస్టు

కర్ణాటక: ఆంధ్రాకు చెందిన సినీ సహాయ నటీమణులను తీసుకువచ్చి చైన్నె వేలచ్చేరిలోని నివాస ప్రాంతంలో వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు సహాయ నటీమణులను విడిపించారు. చైన్నె వేలచ్చేరి కరుమారియమ్మ నగర్‌ గోల్డెన్‌ అవెన్యూ ప్రధాన రోడ్డులో ఉన్న నివాస ప్రాంతంలోని ఒక భవనంలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.

వ్యభిచార నిరోధకపు విభాగం సహాయ కమిషనర్‌ రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ సెల్వరాణి నేతృత్వంలో పోలీసులు గురువారం అర్ధరాత్రి నిఘా చేశారు. ఆ సమయంలో ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతున్నట్టు గుర్తించి వ్యభిచారం నడుపుతున్న బ్రోకర్లు తిరునల్వేలి జిల్లాకు చెందిన సుమియోన్‌ జార్జ్‌ (26), కాంచీపురానికి చెందిన కాళిదాసు (28)ను అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు సహాయ నటీమణులను విడిపించారు. వారి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement