లైంగికదాడి కేసు: రూ.10 లక్షలు నష్టపరిహారం 20 ఏళ్ల జైలు శిక్ష

- - Sakshi

అన్నానగర్‌: పరమక్కుడి సమీపంలో ప్లస్‌టూ విద్యార్థినిపై లైంగికదాడి చేసిన కేసులో రామనాథపురం మహిళా కోర్టు గురువారం ఓ యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రామనాథపురం జిల్లా పరమకుడి సమీపంలోని పొన్నకరై గ్రామానికి చెందిన సంజీవిగాంధీ (35). ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు. ఇతను ప్లస్‌టూ విద్యార్థినిని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సంజీవిగాంధీ పలుమార్లు లైంగికదాడి చేశాడు.

దీంతో విద్యార్థిని గర్భం దాల్చి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన సంజీవిగాంధీపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని నవంబర్‌ 12, 2019న పరమకుడి మహిళా పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు సంజీవిగాంధీని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ రామనాథపురం కోర్టులో విచారణ జరుగుతోంది. గురువారం న్యాయమూర్తి గోపినాథ్‌ సమక్షంలో కేసు విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో సంజీవిగాంధీకి 20 ఏళ్ల జైలు శిక్ష, బాధిత విద్యార్థినికి రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు నిచ్చింది.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top