కొత్త అనుభవం | - | Sakshi
Sakshi News home page

కొత్త అనుభవం

Mar 7 2026 8:14 AM | Updated on Mar 7 2026 8:14 AM

ప్రియాంక మోహన్‌తో దర్శకుడు కార్తీక్‌, నిర్మాత శ్రీనిధి సాగర్‌

తమిళసినిమా: కొత్తదనంతో కూడిన కథా చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఎప్పుడు ఆదరణ ఉంటుంది. దీంతో ఈ తరం దర్శక నిర్మాతలు అలాంటి వైవిధ్యభరిత కథల కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి కొత్త కంటెంట్‌తో రూపొందిన చిత్రం మేడ్‌ ఇన్‌ కొరియా. నటి ప్రియాంక మోహన్‌ ప్రధాన పాత్రను పోషించిన ఇందులో పలువురు కొరియా నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రైస్‌ ఈస్ట్‌ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై శ్రీనిధి సాగర్‌ నిర్మించారు. ఇది ఈ నెల 12వ తేదీ నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు కార్తీక్‌ తెలుపుతూ తన తొలి చిత్రం నిత్తం ఒరు వానంకు మంచి ఆదరణ లభించిందన్నారు. తన రెండవ చిత్రం మేడ్‌ ఇన్‌ కొరియా అని చెప్పారు. కొరియాలో చిత్రీకరించినట్లు చెప్పారు. పర్ఫెక్ట్‌ ప్లానింగ్‌ లేకపోతే అక్కడ షూటింగ్‌ను నిర్వహించడం కష్టం అన్నారు. తాను ఇంతకుముందు దర్శకత్వం వహించిన ఒరు వానం చిత్రం థియేటర్లలో కంటే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత అధిక భాగంలో ప్రేక్షకులు చూశారన్నారు. అందుకే తనకు కొత్తగా అవకాశాలు వస్తున్నా, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుందని చెప్పగానే మేడ్‌ ఇన్‌ కొరియా చిత్రం చేయడానికి అంగీకరించినట్లు చెప్పారు. దీన్ని 13 భాషల్లో అనువాదం చేసి, 36 భాషల్లో సబ్‌ టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌ కానుండడం సంతోషంగా ఉందన్నారు. నటి ప్రియాంక మోహన్‌ మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభానికి ముందు తాను కొరియా డ్రామాలతోపాటు కొన్ని కొరియన్‌ మాటలను నేర్చుకున్నారని చెప్పారు. అదేవిధంగా దర్శకుడు కార్తీక్‌ చెప్పిన ఇన్పుట్స్‌ ఈ చిత్రంలో నటించడానికి తనకు ఉపకరించాయన్నారు. నెలన్నరపాటు కొరియాలో షూటింగ్‌ను నిర్వహించినట్లు, ఆ ప్రాంతంలోని అనూహ్య వాతావరణంలో పనిచేయడం సవాలుగా మారిందన్నారు. తాను తను కొరియన్‌ పదాలు నేర్చుకోవడంతోపాటు దళపతి చిత్రంలోని సుందరి అనే పాటను, పలు తమిళ పదాలను అక్కడి వారికి నేర్పించినట్లు చెప్పారు. చిత్ర దర్శకుడు కార్తీక్‌ సతీమణి కొరియన్‌ డ్రామాల అభిమాని అని, ఆమెను స్ఫూర్తిగా తీసుకొనే దర్శకుడు ఈ కథను తయారు చేసినట్లు చెప్పారు. సెన్బా అనే తాను ఎవరినని తెలుసుకోవడమే చిత్ర కథ అని ప్రియాంక పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement