కొత్త కార్మిక కోడ్‌లపై శిక్షణ
కొరుక్కుపేట: రాబోయే కార్మిక చట్ట సంస్కరణలపై ఐసీఎఫ్ అధికారులు, కాంట్రాక్టర్లలో అవగాహన కల్పించడానికి గురువారం చైన్నె ఐసీఎఫ్‌లోని అడ్వాన్‌న్స్‌డ్ వెల్డింగ్ ట్రైనింగ్ ఇన్‌న్‌స్టిట్యూట్‌లో కొత్త నాలుగు కార్మిక కోడ్‌లపై శిక్షణ కార్యక్రమం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డాక్టర్ శ్రీను నేతృత్వంలో నిర్వహించారు. ఐసీఎఫ్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఆర్.మోహన్‌న్‌రాజా కొత్త కార్మిక కోడ్‌ల నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. ఐసీఎఫ్ జనరల్ మేనేజర్ యూ. సుబ్బారావు మాట్లాడుతూ ఐసీఎఫ్ వంటి పెద్ద ఉత్పత్తి యూనిట్‌లో కార్మిక సంక్షేమం, చట్టబద్ధమైన సమ్మతి, సామరస్య పూర్వక పారిశ్రామిక సంబంధాల అధిక ప్రమాణాల ప్రాముఖ్యతను చెప్పారు. టెక్నికల్ సెషన్ సందర్భంగా డాక్టర్ శ్రీను వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, సామాజిక భద్రత కోడ్‌ల గురించి అవగాహన కల్పించారు.
మహిళలకు
ఉచిత కంటి పరీక్షలు
సాక్షి, చన్నై: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ నేత్ర వైద్యశాల డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆస్పత్రి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ‘గిఫ్ట్ హర్ క్లియర్ విజన్’ అనే వినూత్న ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 280కి పైగా ఆస్పత్రులు, విజన్ కేర్ సెంటర్లలో 10 లక్షల మంది మహిళలకు ఉచిత కంటి పరీక్షలు కన్సల్టేషన్‌న్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆస్పత్రి చీఫ్ క్లినికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్విన్ అగర్వాల్, రీజినల్ హెడ్ డాక్టర్ సౌందరి ఈ వివరాలను శుక్రవారం ప్రకటించారు. భారతదేశంలో మహిళలు కంటి చూపును నిర్లక్ష్యం చేస్తున్నట్టు తేలింది. మహిళల కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఈ ప్రచారం ముఖ్యఉద్దేశంగా అగర్వాల్స్ వర్గాలు ప్రకటించాయి. 9003888444 నంబర్‌కు కాల్ చేసి మహిళల పేరును నమోదుచేసుకునే అవకాశం కల్పించారు. నమోదు చేసుకునే వారికి మార్చి 8 నుంచి 31వ తేదీల్లో అపాయింట్‌మెంట్ ఖరారు చేయనున్నారు.
విజేతలకు
బహుమతుల ప్రదానం
సాక్షి ,చైన్నె: పాదరక్షల తయారీలో పేరుగడించిన శ్రీలెదర్స్ సంస్థ ఆన్‌లైన్ సెల్ఫీ కోలం పోటీ (ముగ్గుల పోటీ) పేరుతో నిర్వహించింది. ఈ ముగ్గుల పోటీ విజేతల బహుమతి ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. స్థానిక పురసైవాక్కంలోని శ్రీలెదర్స్ షోరూమ్‌లో ముగ్గుల పోటీల్లో మూడుసార్లు విజేతగా నిలిచిన సత్యారామ్‌కుమార్, సినీ నటి ఉపాసన ఆర్సీ, శ్రీలెదర్స్ సంస్థ పార్టనర్లు సుశాంతో డే, పూజారిణి డే హాజరై బహుమతులను ప్రదానం చేశారు. పూజారిణి డే మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 15 నుంచి జనవరి 20వ వరకు నిర్వహించిన ఈ పోటీల్లో 2,500 మంది పాల్గొన్నారని వివరించారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తమవంతు బాధ్యతగా ప్రతి ఏడాది ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
అన్నానగర్: ముంబయికి చెందిన పూనమ్ శర్మ (52 హోమియోపతి వైద్యురాలు. ఈమె చైన్నె లోని తేనాంపేట ప్రాంతంలో ఉన్న హోటల్‌లో గది తీసుకుని ఉంది. ఆమె స్వయంగా ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్‌గా పరిచయం చేసుకొని ఆంగ్ల వైద్య విధానంలో రోగులకు చికిత్స ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఈమైపె తమిళనాడు వైద్య సేవల డైరెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేయబడింది. వెంటనే తమిళనాడు వైద్య సేవ డైరెక్టరేట్ అధికారులు ఒక నిర్ధిష్ట సమయంలో హోటల్‌పై తనిఖీ చేశారు. ఆ సమయంలో పూనమ్ శర్మ రోగులకు ఆంగ్ల వైద్యపరంగా చికిత్స అందించినట్లు కనుగొనబడింది. ఈ విషయంలో తేనాంపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. హోమియోపతి వైద్యురాలు పూనమ్ శర్మను గురువారం రాత్రి అరెస్టు చేశారు. ఆమెకి సహాయకురాలిగా ఉన్న చైన్నె షావుకారుపేటకు శిల్ప(44)ను కూడా అరెస్టు చేశారు.
మాట్లాడుతున్న ఐసీఎఫ్ జీఎం


