వినోదాత్మకంగా ముస్తఫా ముస్తఫా | - | Sakshi
Sakshi News home page

వినోదాత్మకంగా ముస్తఫా ముస్తఫా

Mar 7 2026 8:14 AM | Updated on Mar 7 2026 8:14 AM

తమిళసినిమా: ది మాపోగోస్‌ కంపెనీ పతాకంపై ప్రదీప్‌ మహాదేవ్‌ నిర్మించిన చిత్రం ముస్తఫా ముస్తఫా. సతీష్‌, సురేష్‌, పుగళ్‌, కరుణాకరన్‌, మోనికా చిన్న కోట్లా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రవీణ్‌ శరవణన్‌ దర్శకత్వం వహించారు. జోస్‌ రుపెర్ట్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. దీన్ని శక్తి ఫిలిమ్స్‌ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేసింది. పూర్తి వినోదాత్మక ప్రేమ కథగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్న ఆనందాన్ని చిత్ర నిర్మాత ప్రదీప్‌ మహాదేవ్‌, శక్తి ఫిలిమ్స్‌ శక్తివేలన్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అందులో ముస్తఫా ముస్తఫా చిత్రాన్ని పూర్తి నమ్మకంతో ఎంతో శ్రమించి నిర్మించినట్లు పేర్కొన్నారు. శక్తి ఫిలిమ్స్‌ సంస్థ విడుదల చేస్తే చిత్రం మినిమం గ్యారెంటీ అనే పేరు ఉందని, అలాంటి సంస్థ తమ చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. చిత్రం విడుదలకు ముందే సినీ ప్రముఖులు, విమర్శల ప్రశంసలు అందుకుందని, ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణను పొందడం సంతోషంగా ఉందని అన్నారు. శక్తి ఫిలిమ్స్‌ శక్తివేలన్‌ మాట్లాడుతూ ముస్తఫా ముస్తఫా చిత్రాన్ని 150కి పైగా థియేటర్లలో విడుదల చేసినట్లు చెప్పారు. యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోందని తెలిపారు. దీంతో మరిన్ని థియేటర్లను పెంచే అవకాశం ఉందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement