గాయనిగా శ్రుతిహాసన్‌ | - | Sakshi
Sakshi News home page

గాయనిగా శ్రుతిహాసన్‌

Mar 7 2026 8:14 AM | Updated on Mar 7 2026 8:14 AM

తమిళసినిమా: ఇప్పుడు సినిమా పాటలకు దీటుగా ఇండిపెండెంట్‌ పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఇండిపెండెంట్‌ పాటలకు ఈ తరం యువతలో ప్రత్యేకత ఏర్పడుతోంది. ఇలాంటి ఇండిపెండెంట్‌ ఆల్బమ్‌లతోనే యువ సంగీత దర్శకుడు సాయ్‌ అభయంకర్‌ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సినీ రంగంలో సంగీత దర్శకుడిగా దూసుకుపోతున్నారు. అదేవిధంగా నటి శ్రుతిహాసన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కథానాయకిగా అగ్రస్థానంలో రాణిస్తున్న ఈమెలో మంచి గాయని, సంగీత దర్శకురాలు ఉన్నారన్నది తెలిసిందే. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి చిత్రం కోసం శ్రుతిహాసన్‌ పాడిన సాహసమే అనే పల్లవితో సాగే పాట శ్రోతలను విపరీతంగా ఆలోచిస్తుంది. తాజాగా సంగీత దర్శకుడు సాయ్‌ అభయంకర్‌తో కలిసి నటి శ్రుతిహాసన్‌ పాడిన పవళ మల్లి అనే పల్లవితో సాగే ఇండిపెండెంట్‌ పాట ఇటీవల విడుదలై విశేష ఆదరణను పొందుతోంది. చక్కని ప్రేమ తో కూడిన ఈ పాటలో అంతకుమించిన భావోద్రేకాలు చోటుచేసుకున్నాయి. గీత రచయిత వివేక్‌ రాసిన ఈ పాటకు సాయ్‌ అభయంకర్‌ బాణీలు కట్టార ు. ఆయనతో కలిసి నటి శ్రుతిహాసన్‌ మధురమైన గొంతుతో ఆలపించిన ఈ పాట ఇప్పుడు యువతను ఉర్రూతలూగిస్తోంది.

సంగీత దర్శకుడు సాయ్‌ అభయంకర్‌తో సంతోష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement