వేలూరు: డీఎంకే ప్రభుత్వంలోనే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు ఎమ్మె ల్యే నందకుమార్ అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గంలోని ప్రయివేటు కల్యాణ మండపంలో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన లబ్ధిదారులకు వివిధ శాఖల ద్వారా సంక్షేమ పథ కాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామన్నారు. వేలూరు జిల్లాలోనే అనకట్టు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకు రావడానికి అన్ని ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నేరుగా చేర్చుతున్నామన్నారు. అనకట్టు నియోజక వర్గంలో అధికంగా అటవీ ప్రాంతాలు, కుగ్రామాలు ఉన్నప్పటికీ అన్ని ప్రాంతాలకు రోడ్డు, బస్సు వసతి కల్పించామని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లోనే రేషన్ దుకాణాలను ప్రారంభించామని చెప్పారు. ఎటువంటి డ్యామ్ లేని అనకట్టు ప్రాంతంలోని రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక నీటి ప్రాజెక్టును తీసుకొచ్చామని చెప్పారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వివిధ శాఖల ద్వారా సంక్షేమ పథకాలను అందజేశారు. జెడ్పీ చైర్మన్ బాబు, సబ్ కలెక్టర్ సెంథిల్‌కుమార్, యూనియన్ చైర్మన్ భాస్కరన్, వైస్ చైర్మన్ చిత్ర, సర్పంచ్ తిలగవది పాల్గొన్నారు.
డీఎంకే ముస్లింలకు అండగా ఉంటుంది
వేలూరు: డీఎంకే పార్టీ ఎప్పటికీ ముస్లింలకు మద్దతుగా ఉంటుందని ఎమ్మెల్యే కార్తికేయన్ అన్నారు. వేలూరు అన్నా రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ముస్లింలకు రంజాన్‌కు అవసరమైన నిత్యావసర వస్తువులను ఉచితంగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ రూ.3 వేలు విలువ చేసే నిత్యావసర వస్తువులు, రూ.200 నగదును ప్రతి కుటుంబానికి అందజేస్తున్నట్లు తెలిపారు. మేయర్ సుజాత, మాజీ ఎంపీ మహ్మద్‌సఖీ, జోన్ చైర్మన్ వీనస్ నరేంద్రన్, యూకబ్‌ఖాన్, మురుగన్, మహేంద్రన్, బాలమురళీక్రిష్ణ పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు ఇస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే
ముస్లింలకు నిత్యావసర వస్తువులు ఇస్తున్న ఎమ్మెల్యే


