
ఈ విషయం సత్యకు తెలియడంతో భార్యను మందలించాడు.
తమిళనాడు: తన అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్నేహితుడిని చంపిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నామక్కల్ జిల్లా వెలగౌండంపట్టిలోని అక్కలంపట్టి అరుంధతీ కాలనీకి చెందిన కందస్వామి కుమారుడు శీను (23), అదే పట్టణానికి చెందిన శక్తివేల్ కుమారుడు ప్రవీణ్‌కుమార్ (21) స్నేహితులు. ప్రవీణ్‌కుమార్ మేనమామ సత్య భార్య మీనా (29)తో కలిసి అదే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ క్రమంలో శీనుకు ప్రవీణ్‌కుమార్ అత్త మీనాతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఈ విషయం సత్యకు తెలియడంతో భార్యను మందలించాడు. అయితే శీనుతో సంబంధాన్ని వదులుకోకపోవడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఇందులో వారిద్దరూ చర్చించుకుని మరోసారి కలవకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే మామ, అత్తకు చెడ్డపేరు తెచ్చిన శీనును చంపడానికి ప్రవీణ్ కుమార్ నిర్ణయించుకున్నాడు.
సోమవారం రాత్రి శీను ఇంటికి వెళ్లి బయట నిద్రిస్తున్న అతని మెడ, ఛాతి, తొడలపై కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. శీను అరుపులు విని స్థానికులు అక్కడికి వచ్చారు. అయితే అప్పటికే అతను మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నామక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. హత్య చేసి పరారైన ప్రవీణ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.