అలాంటి వ్యక్తినే మనువాడతా! | - | Sakshi
Sakshi News home page

అలాంటి వ్యక్తినే మనువాడతా!

Jun 11 2023 7:22 AM | Updated on Jun 11 2023 8:00 AM

- - Sakshi

తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న నటి అంజలి. రామ్‌ దర్శకత్వంలో కట్రదు తమిళ్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథనాయాకిగా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి అంజలి. ఆ తరువాత అంగాడి తెరు చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకుంది. ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌, కలగలప్పు వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి.

అదే విధంగా కొన్ని చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్స్‌, వెబ్‌ సీరిస్‌లోనూ నటిస్తూ ఇప్పటికి బిజీగానే ఉన్నారు. ఇకపోతే వ్యక్తిగత జీవితంలో ప్రేమ, పెళ్లి వంటి పలు వదంతుల్లోనూ చిక్కుకున్నారు. ముఖ్యంగా ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌ చిత్రం షూటింగ్‌ సమయంలో ఆ చిత్ర కథానాయకుడు జయ్‌తో పరిచయం ప్రేమగా మారడం, ఇద్దరు చాలా కాలం సహ జీవనంలో ఉన్నారు అనే ప్రచారం జోరుగా సాగింది. అంతేగాక నటుడు జయ్‌, అంజలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా సాగింది. అలాంటిది మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోయారంటూ నటి అంజలి హైదరాబాదుకు మకాం మార్చినట్లు ప్రచారం జరిగింది.

ప్రస్తుతం 36 ఏళ్ల ఈ బ్యూటీ సింగిల్‌ గానే ఉన్నారు. ఇటీవల ఒక భేటీలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు రిలేషన్‌షిప్‌లో మర్యాద చాలా ముఖ్యం అని అంజలి పేర్కొన్నారు. ఆ తర్వాతే ప్రేమ, అభిమానం అన్నీ అన్నారు. మర్యాద లేని వ్యక్తితో సంబంధమే తనకు అవసరం లేదని పేర్కొన్నారు. కెరీర్‌, రిలేషన్‌షిప్‌లలో ఏది కోరుకుంటారు అన్న ప్రశ్నకు తనకు రెండు ముఖ్యమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement