పాముకాటుతో చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో చిన్నారి మృతి

May 29 2023 7:02 AM | Updated on May 29 2023 9:16 AM

- - Sakshi

కొండపైకి చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్తున్న కుటుంబ సభ్యులు

ఇంటి సమీపంలో ఆటలాడుతున్న ధనుష్కను పాము కరవడంతో చిన్నారి కేకలు వేసింది.

వేలూరు: వేలూరు జిల్లా అనకట్టు నియోజక వర్గంలోని అల్లేరి కొండపై ఉన్న అత్తిమరత్తూరు గ్రామానికి చెందిన విజయ్‌ ఇతని భార్య ప్రియ దంపతుల కుమార్తె ధనుష్క(2). ఇంటి సమీపంలో ఆటలాడుతున్న ధనుష్కను పాము కరవడంతో చిన్నారి కేకలు వేసింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనకట్టు ప్రాంతంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే రోడ్డు వసతి లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లడానికి ఆలస్యమైంది. దీంతో చిన్నారి ఆసుపత్రికి వెళ్లే సరికే చిన్నారి మృతి చెందింది. స్థానిక పోలీసు లు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లిన అంబులెన్స్‌ అల్లేరి కొండ కిందనే నిలిపి వేయడంతో సుమారు 10 కిలో మీటరు దూరం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భుజంపై మోసుకొని కన్నీరు, మున్నీరుగా రోదిస్తూ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement