ఆటో కార్మికుల రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

ఆటో కార్మికుల రాస్తారోకో

Oct 28 2026 1:12 AM | Updated on Oct 28 2026 1:12 AM

– ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని డిమాండ్‌

తిరువళ్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిందని ఆరోపిస్తూ ఆటో కార్మికులు ఆందోళనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌ వద్ద జరిగిన ఆందోళనకు సంఘం జిల్లా అద్యక్షుడు దేవనేషన్‌ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా సీఐటీయూ కార్యదర్శి కరిముల్లా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పెట్టిన ఉచిత వెట్రి ప్రయాణం వల్ల ఆటో కార్మికులకు జీవనోపాధి దెబ్బతిని జీవన ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తమిళనాడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలి. ఏటా ఆటో కార్మికులకు రూ. 25 వేలు సాయం చేయాలి. 13 సంవత్సరాల క్రితం పెంచిన మీటర్‌ ఆటో చార్జీలను ప్రస్తుతం మరింత పెంచుకోవడానికి అనుమతించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో తమ ఆందోళననూ మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement