కొరుక్కుపేట: రామ్ కో సిమెంట్స్ ఏఐ పరిష్కారాలకు గాను సీఐఐ నేషనల్ ఏఐ అవార్డులలో రెండు గుర్తింపులను గెలుచుకుందని రామ్కో సిమెంట్స్ లిమిటెడ్ సీఈఓ ఎ. వి. ధర్మకృష్ణన్ తెలిపారు. ఈ మేరకు ఆయ న మాట్లాడుతూ వ్యాపార ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను మెరుగుపరచడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్ (ఏఐ)ను ఉపయోగించుకోవడంలో కంపెనీ నిబద్ధతను నొక్కిచెబుతూ, రామ్ కో సిమెంట్స్ లిమిటెడ్ సిఐఐ నేషనల్ ఏఐ అవార్డులలో రెండు గెలుచుకుందన్నారు. ఉత్తమ పరిశ్రమ ఏఐ అప్లికేషన్‌లో శ్రేష్ఠత, ఉత్తమ ఏఐ సొల్యూషన్ షోకేస్‌లో శ్రేష్ఠత అనే రెండు అవార్డులను గెలుచుకుందని తెలిపారు. ఈ అవార్డులకు 296 నామినేషన్లు రాగా, వాటిలో ఎంపిక చేసిన కొన్ని సంస్థలు తమ విజయాలకు గుర్తింపు పొందాయి. వాస్తవ ప్రపంచ వ్యాపార అవసరాలను తీర్చే యాజమాన్య ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి, రామ్ కో సిమెంట్స్ చేస్తున్న ప్రయత్నాలను ఈ గుర్తింపులు హైలైట్ చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.


