సాక్షి, చైన్నె: ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న సీ, డీ కేటగిరీ ఉద్యోగులకు 20 శాతం వరకు దీపావళి బోనస్ ఇవ్వనున్నట్లు సీఎం విజయ్ మంగళవారం ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్యోగుల అవి శ్రాంత కృషి, అంకితభావం, నైపుణ్యం గల మానవ వనరులు , ప్రభుత్వ దూరదృష్టితో కూడిన విధానాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. తయారీ, ఆటోమొబైల్స్, ఇంజనీరింగ్, వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా పలు రంగాలలో తమిళనాడు అగ్రగామిగా ఉందని గుర్తు చేశారు. తమిళనాడు ఆర్థికాభివృద్ధికి, ప్రభు త్వ రంగ సంస్థల కార్యకలాపాలకు గణనీయంగా దోహదపడే కార్మికులు, ఉద్యోగుల కృషి , అంకితభావాన్ని గుర్తించి, వారిని ప్రోత్సహించేందుకు సీఎం విజయ్ 2025–26 సంవత్సరానికి అదనపు వేతనాలు, ఎక్స్–గ్రేషియా చెల్లించాలని ఆదేశించారని తెలిపారు. పే యాక్ట్, 2019 (గతంలో సవరించిన బోనస్ యాక్ట్, 2015) ప్రకారం, అదనపు జీతానికి అర్హత ఉన్న జీతం గరిష్ట పరిమితి రూ. 21,000, తదనుగుణంగా అదనపు జీతాన్ని లెక్కించడానికి నెలవారీ జీతం గరిష్ట పరిమితి రూ. 7,000 పైన పేర్కొన్న గరిష్ట పరిమితిని సడలించి, అన్ని ఇ ,ఈ కేటగిరీ ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు , ఉద్యోగులకు 2025–26 సంవత్సరానికి అదనపు జీతం , గ్రాట్యుటీని పెంచినట్టు వివరించారు.
20 శాతం..
సి, డి కేటగిరీ ఉద్యోగులు, లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఆయా సంస్థలు కేటాయించిన మిగులును పరిగణనలోకి తీసుకుని, గరిష్టంగా 8.33 శాతం అదనపు వేతనం , 11.67 శాతం ఎక్స్–గ్రేషియాతో కలిపి మొత్తం 20 శాతం బోనస్ అందించడం జరుగుతుందన్నారు. అలాగే, తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ, తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థలు, తమిళనాడు వినియోగ వస్తువుల వ్యాపార సంస్థ , తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సహకార నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న అర్హులైన సి , శ్రీడిశ్రీ కేటగిరీ కార్మికులు, ఉద్యోగులకు 8.33 శాతం అదనపు వేతనం , 11.67 శాతం ఎక్స్–గ్రేషియా, మొత్తం 20 శాతం అందిస్తామన్నారు. ఇక,. కేటాయించదగిన మిగులు లేని ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న సి , డి కేటగిరీ కార్మికులు , ఉద్యోగులకు 8.33 శాతం కనీస మిగులు వేతనం, 1.67 శాతం ఎక్స్–గ్రేషియా, మొత్తం 10 శాతం అందిస్తామన్నారు. తమిళనాడు హౌసింగ్ బోర్డ్ , చైన్నె డ్రింకింగ్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్‌లో పనిచేస్తున్న అర్హులైన సి ,డి కేటగిరీ ఉద్యోగులకు 8.33 శాతం అదనపు వేతనం, 1.67 శాతం ఎక్స్–గ్రేషియా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. తమిళనాడు తాగునీరు, మురుగునీటి నిర్వహణ బోర్డులో పనిచేస్తున్న అర్హులైన సి,డి కేటగిరీ ఉద్యోగులకు 8.33 శాతం బోనస్ అందిస్తామన్నారు. వినియోగ వస్తువుల కార్పొరేషన్‌లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు రూ. 3,000 గ్రాట్యుటీ ఇస్తామని పేర్కొన్నారు. శాశ్వత ఉద్యోగులు కనీసం రూ. 8,400 నుంచి గరిష్టంగా రూ. 16,800 వరకు బోనస్‌ను పొందుతారని ప్రకటించారు.. మొత్తం మీద, తమిళనాడు ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న 2,60,497 మంది కార్మికులకు రూ. 367.20 కోట్ల బోనస్‌గా అందించడం జరుగుతుందన్నారు.


