కొరుక్కుపేట: మరుగుజ్జు వ్యక్తులల్లో దాగిఉన్న సృజనాత్మక ప్రతిభను కనుగొని వారి కలలను సాకారం చేసే లక్ష్యంలో చైన్నెలో ఫిల్మ్ శిక్షణా వర్క్ షాప్‌ను నిర్వహించారు. తమిళనాడు డ్వార్ఫిజం వెల్ఫేర్ అసోసియేషన్, చైన్నె విల్లింగ్టన్ కార్పొరేట్ ఫౌండేషన్ సహకారంతో మరగుజ్జు వ్యక్తుల కోసం ఈ ఫిల్మ్ ట్రైనింగ్ వర్క్‌షాప్‌ను నిర్వహించింది. తమిళనాడు డ్వార్ఫిజం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.జి. రాహు ల్ వర్క్‌షాప్ లక్ష్యాలను వివరిస్తూ, మరగుజ్జు వ్యక్తులకు వృత్తి అవకాశా లను అన్వేషించడానికి అవకాశాలు కల్పించడం అని చెప్పారు. తమిళనాడు ఏయల్ ఇసై నాటక మన్రం అధ్యక్షులు డాక్టర్ పుష్పవనం కుప్పుస్వామి తదితరులు పాల్గొన్నారు.


