రెవంజా అంబాసిడర్‌గా నటుడు రవి మోహన్
సాక్షి,చైన్నె : ప్రముఖ తమిళసినీ నటుడు రవి మోహన్‌ను రెవాంజా డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు . ఈ సందర్భంగా చైన్నెలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చైన్నెకి చెందిన రెవంజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి నివాస రియల్ ఎస్టేట్ సంస్థ అయిన రెవంజా డెవలపర్స్ వ్యవస్థాపక చైర్మన్ సుశీల్ లల్వానీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తమిళ సినీ నటుడు రవిమోహన్‌ను కంపెనీ కార్పొరేట్ బ్రాండ్ అంబాసిడర్‌గా సభకు పరి చయం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ సందర్భంగా రెవంజా డెవలపర్స్ కార్పొరేట్ బ్రాండ్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
నగల చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె కొడుంగయ్యూర్ ఆర్.కె.నగర్ ప్రాంతానికి చెందిన సుందరి (46) అనే మహిళ ఎన్జీఓ (స్వచ్ఛంద సంస్థ) నడుపుతున్నారు. ఈమెకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. గత జూన్ నెల 21వ తేదీన తన ఇంటి బీరువాలో ఉన్న నగలను సరిచూసుకోగా, 19 సవర్ల బంగారు నగలు మాయమైనట్లు గుర్తించి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సుందరి అక్క శ్రీదేవి మరణించడంతో, ఆమె కుమార్తె పెమినా కొన్ని రోజులు సుందరి ఇంట్లోనే బస చేసింది. ఆమె వెళ్లిపోయిన తర్వాతే నగలు కానిపించకుండా పోవడంతో, పెమినాపై సుందరికి అనుమానం వచ్చింది. దీనిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కొడుంగయ్యూర్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సెల్వమణి నేతృత్వంలోని పోలీసులు విచారణ జరిపి, పెమినా స్నేహితురాలైన లాయర్ శృతిక (23)ను సోమ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఇందులో, పెమినా దొంగిలించి ఇచ్చి న నగలను శతిక రెండు వేర్వేరు చోట్ల తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నట్లు తేలింది. ఆమె వద్ద నుండి 3 సవర్ల నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగలు సుందరి ఇంట్లో పోయినవేనని నిర్ధారణ అయ్యింది. దీనిని బట్టి శృతికను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పెమినాను కూడా మళ్లీ విచారించాలని పోలీసులు నిర్ణయించారు.
5 సవర్ల తాళి దోపిడీ...
– ఇద్దరి కోసం గాలింపు
అన్నానగర్: చెంగల్పట్టు జిల్లా సిద్ధయూర్ సమీపం కొలంబాక్కం గ్రామానికి చెందిన సెంథిల్ కుమార్. ఇతని భార్య నలని (38) సిద్ధమూర్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. ఈమె మంగళవారం రాత్రి 9 గంటలకు పని ముగించుకుని తన స్కూటీపై ఇంటికి బయలుదేరింది. ఆమె కొలంబాక్కం చేరుకున్నప్పుడు, బైకు పై వచ్చిన ఇద్దరు ఆమెను అడ్డగించి, బెదిరించి, ఆమె మెడలోని 5 సవర్ల బంగారు తాళిని లాక్కొని పారిపోయారు. ఈ విషయంపై సిద్దమూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
నల్లజెండాలతో నిరసన
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ వయలూరు గ్రామంలోని ము మ్ముడికుప్పం ప్రాంతంలో సుమారు మూడువందల కుటుంబాలు నివాసం ఉంటున్నారు. వీరికి 2004, 2018 తదితర రెండు సంవత్సరాల్లో సుమారు మూడువందల కుటుంబాలకు ఇంటి పట్టాలను మంజూరు చేశారు. ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిన క్రమంలో స్థానికులు నివాసాలను ఏర్పాటు చేసుకుని నివాసం వుంటున్న క్రమంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతం నీటి ఆధారిత ప్రాంతమని, అక్కడ నివాసం ఉంటున్న స్తానికులు వెంటనే ఖాళీ చేయాలని కోరుతూ అధికారులు ఆదేశాలు జారీ చేసి బోర్డును ఏర్పాటు చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానికులు నల్లజెండాలను ప్రదర్శించారు. ఏళ్ల తరబడి నివాసం వుంటున్న తమకు ఖాళీ చేయాలని అధికారులు చెప్పడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఒమందూరార్ కాంప్లెక్స్‌లో 76 కొత్త అద్దె అపార్ట్‌మెంట్లు
– నిర్మిస్తున్న హౌసింగ్ బోర్డు
కొరుక్కుపేట: చైన్నెలోని అన్నాసాలైలో ఉన్న ఓమందూరార్ ప్రభుత్వ ఎస్టేట్ కాంప్లెక్స్‌లో 76 కొత్త అద్దె అపార్ట్‌మెంట్‌లను నిర్మించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు హౌసింగ్ బోర్డ్– నందనం డివిజన్ ఈ పనిలో మొదటి దశగా మట్టి పరీక్షల కోసం టెండర్లను ఆహ్వానించింది. మట్టి పరీక్షల టెండర్ అంచనా వ్యయం రూ. 3.39 లక్షలు. టెండర్దారులు గత 5 సంవత్సరాలలో ఇదే విధమైన పని కోసం టెండర్లను సమర్పించారు.ఒకే కాంట్రాక్టులో 50 శాతం విలువకు సమానమైన పనిని చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాకు తక్కువ కాని అధికారి ద్వారా ఒక ధృవీకరణ పత్రాన్ని పొంది, సమర్పించాలి. 1.1.2000కు ముందు నమోదు చేసుకున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వ శాఖ ధృవీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


