డాక్టర్‌ను బురిడీ కొట్టించిన అమెరికా యువతి | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ను బురిడీ కొట్టించిన అమెరికా యువతి

Apr 24 2023 1:28 AM | Updated on Apr 24 2023 8:27 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: ప్రేమ, పెళ్లి పేరిట పుదుచ్చేరికి చెందిన వైద్యుడిని అమెరికాకు చెందిన ఓ యువతి బురిడీ కొట్టించింది. అతడి వద్ద నుంచి రూ. 37 లక్షలు తస్కరించి స్విచ్‌ ఆఫ్‌ చేసింది. వివరాలు.. ఆలస్యంగా మేల్కొన్న డాక్టర్‌ ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. పుదుచ్చేరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాలాజీ(34) డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. రెండో వివాహం చేసుకునేందుకు నిర్ణయించిన బాలాజీ తన వివరాలను ఓ వివాహ వెబ్‌సైట్‌లో పెట్టాడు. దీనిని చూసి అమెరికాలోని సోము శ్రీనాయర్‌ అనే యువతి బాలాజీకి దగ్గరైంది.

ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకున్నారు. చాటింగ్‌లు చేసుకున్నారు. పరస్పరం తమ భావాలను అంది పుచ్చుకున్నారు. ఇద్దరు వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో అమెరికాలో తనకు హఠాత్తుగా రెండు సార్లు ఆర్థిక సమస్యలు ఎదురు కావడంతో ఆ యువతి బాలాజీని సాయం కోరింది. తనకు కాబోయే భార్యను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు రూ. 37 లక్షలు అందజేశాడు. అయితే గత నాలుగైదు రోజులుగా సోమ శ్రీ నాయర్‌ ఫోన్‌ స్పందించక పోవడం, సామాజిక మాధ్యమాల్లోని పేజీలను ఆమె బ్లాక్‌ చేసి ఉండటంతో తాను మోస పోయినట్లు గ్రహించిన డాక్టరు పోలీసులను ఆశ్రయించాడు.

Advertisement
 
Advertisement
Advertisement