సూర్యాపేటటౌన్ : అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. బుధవారం సూర్యాపేటలోని పీఆర్‌టీయూ జిల్లా కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఆన్‌లైన్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి సమక్షంలో పీఆర్‌టీయూలో చేరారు. చేరిన వారికి సంఘం సభ్యత్వాలు అందజేసి మాట్లాడారు. జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్లు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో కూడా హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తున్న అతిపెద్ద సంఘం పీఆర్‌టీయూ అని పేర్కొన్నారు. పెండింగ్ డీఏలు, బిల్లులు ఇప్పించడానికి, సీపీఎస్ విధానానికి రద్దు కోసం సంఘం ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు తంగెళ్ల జితేందర్‌రెడ్డి, తీగల నరేష్, సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, శివశంకర్, వీరేష్, యల్లయ్య, అంకతి వెంకన్న, పులుసు శ్రీనివాస్, వంగపల్లి రమేష్, శ్రీనివాస్, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి


