పాఠశాలల్లో నేటి నుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో నేటి నుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ)–1 పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం గురువారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

జిల్లాలో 90వేల మంది విద్యార్థులు

జిల్లాలో 950 ప్రభుత్వ, 350 ప్రైవేటు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లు, రెసిడెన్షియల్స్‌ స్కూళ్లతో కలిపి మొత్తం 1,400 పాఠశాలల్లో 90 వేల మంది విద్యార్థులు విద్యసభ్యసిస్తున్నారు. వీరందరికీ తరగతుల వారీగా వేర్వేరు సమయాల్లో పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ రూపొందించారు.

యాప్‌ ద్వారానే

ఎరువులు విక్రయించాలి

నడిగూడెం : యాప్‌ ద్వారానే రైతులకు ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధరరెడ్డి ఆదేశించారు. బుధవారం నడిగూడెం మండల కేంద్రంలోని పలు ఎరువుల షాపులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులను అధిక ధరలకు విక్రయించొద్దన్నారు. ఆయన వెంట ఏఓరి గోలి మల్సూర్‌ తదితరులు ఉన్నారు.

నేడు అర్వపల్లిలో

ఆర్డీఆర్‌ విగ్రహావిష్కరణ

అర్వపల్లి : అర్వపల్లిలోని వై జంక్షన్‌లో గురువారం మాజీ మంత్రి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దామోదర్‌రెడ్డి అభిమానుల ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. విగ్రహావిష్కరణ అనంతరం జంక్షన్‌లో సభ ఉంటుందని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు దరూరి యోగానందచార్యులు తెలిపారు. బుధవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఈకార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, నర్సింగ శ్రీనివాస్‌గౌడ్‌, మోరపాక సత్యం, సర్పంచ్‌లు బింగి కృష్ణమూర్తి, మంచాల లలితరామ్మూర్తి, కుంటిగొర్ల శ్రీనివాస్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నేటి నుంచి సైబర్‌

సెక్యూరిటీ అవేర్‌నెస్‌

సూర్యాపేటటౌన్‌ : ప్రజలు సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండేలా గురువారం నుంచి ఈనెలంతా సైబర్‌ సెక్యూరిటీ అవేర్‌నెస్‌ మంత్‌గా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కె.నరసింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగండి.. ఆలోచించండి.. అడుగు వేయండి అనే సందేశంతో గురువారం సైబర్‌ సెక్యూరిటీ ఫ్లాష్‌ వాక్‌తో అవగాహన కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నెల రోజుల పాటు సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement