డబుల్‌ రోడ్డుగా మార్చాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

డబుల్‌ రోడ్డుగా మార్చాలని ఆందోళన

Oct 1 2026 9:45 AM | Updated on Oct 1 2026 9:45 AM

చిలుకూరు : చిలుకూరు నుంచి దూదియాతండా మీదుగా కోదాడ మండలం గుడిబండ వరకు వెళ్లే రహదారిని వెంటనే డబుల్‌ రోడ్డుగా మార్చాలని కోరుతూ ఆయా గ్రామాల రైతులు, విద్యార్థులు బుధవారం చిలుకూరులోని బస్టాండ్‌ సెంటర్‌లోని దూదియాతండా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దూదియాతండా రోడ్డు సింగిల్‌ లైన్‌గా ఉండటంతో రాకపోకలకు వాహనదారులు, చిలుకూరులోని జెడ్పీహెచ్‌ఎస్‌కు వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికై నా మంత్రి ఉత్తమ్‌, ఎమ్మెల్యే పద్మావతి స్పందించి రోడ్డును డబుల్‌ లైన్‌గా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు, దూదియాతండా రైతులతోపాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement