హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్, కోదాడ బస్‌స్టేషన్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఈ రెండు బస్‌స్టేషన్ల నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో ఆయన మాట్లాడారు. కోదాడ ఆధునిక బస్‌స్టేషనన్ నిర్మాణానికి రూ.16.80 కోట్లు, హుజూర్‌నగర్ బస్‌స్టేషన్ పునరుద్ధరణకు రూ.3.50కోట్లతో కలిపి మొత్తం రూ 20.30 కోట్లు మంజూరయ్యాయన్నారు. బస్టాండ్ల నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టేలా పర్యవేక్షించాలని టీజీఎస్ ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, టీజీ ఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీ రాజశేఖర్, సీఈ కవిత, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశం


