4,184
కేసులు
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసమే జాతీయ మెగాలోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించామని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ మెగాలోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జిల్లా కోర్టుతో పాటు, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్ కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా మొత్తం 4,184 కేసులు పరిష్కరించామని, ఆయా కేసుల్లో కక్షిదారులతోపాటు బ్యాంకు లావాదేవాలకు సంబంధించిన బాధితకులకు రూ.3.38కోట్ల నగదును నష్టపరిహారంగా చెల్లించామన్నారు. కోర్టుల తిరుగతూ ధనం, సమయం వృథా చేసుకోకుండా రాజీ పడటం ద్వారా ఇరువర్గాల వారు గెలిచిన వారవుతారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో సీనియర్ న్యాయవాది ఎండీ.ఫరీదొద్దీన్ కక్షిదారులకు పులిహోర ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.భవ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, జిల్లా కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా మొదటి అదనపు
న్యాయమూర్తి శివరాం ప్రసాద్
ఫ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్


