సూర్యాపేట అర్బన్ : నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదా యకమని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను శుక్రవారం సూర్యాపేటలోని కామ్రేడ్ ధర్మ భిక్షం విగ్రహం వద్ద ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహించే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలలో ప్రజలు పద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఉస్తెల నారాయణరెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉస్తెల సృజన, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లంల యాదగిరి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ సీపీఐ జిల్లాకార్యదర్శి వెంకటేశ్వర్లు


