సూర్యాపేట : సూర్యాపేటకు బుల్లెట్ రైలు సాధన ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, సిటీ టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ మురళి అన్నారు. శనివారం 30వ రోజు బుల్లెట్ రైలు సాధన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు మద్దతుగా సిటీ టాలెంట్ స్కూల్ పూర్వ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహ వద్ద రిలే దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంతకుముందు దీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూర్చుని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ టాలెంట్ స్కూల్ పూర్వ విద్యార్థులు, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు, బుల్లెట్ రైలు సాధన కమిటీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


