కేతేపల్లి : హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవులతో పాటు వివాహాలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో చాలామంది రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లారు. వారంతా ఆదివారం తిరుగు పయనమయ్యారు. దీంతో ఆదివారం సాయంత్రం జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగింది. కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వాహనాలు బారులుదీరాయి. టోల్‌ప్లాజాను దాటి వెళ్లేంత వరకు వాహనాలు నెమ్మదిగా కదిలాయి. టోల్‌ప్లాజాను దాటేందుకు వాహనదారులకు ఒక్కో సమయంలో ఇరవై నిమిషాలకు పైగా సమయం పట్టింది.


