కార్డులకు ఎదురు చూపులు | - | Sakshi
Sakshi News home page

కార్డులకు ఎదురు చూపులు

Sep 7 2026 7:27 AM | Updated on Sep 7 2026 7:27 AM

భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డుల కోసం మెజార్టీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డుల స్థానంలో కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన స్మార్ట్‌ కార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 ఆగస్టున జిల్లాలోని కొంతమంది లబ్ధిదారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఆ తరువాత మండలాల్లో స్మార్ట్‌ కార్డుల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

జిల్లాలో 3,71,783 రేషన్‌ కార్డులు

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 3,71,783 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఇందులో 9 లక్షలకు పైగా లబ్ధిదారులు కార్డుల ద్వారా రేషన్‌ పొందుతున్నారు. వీరందరికీ స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 10వేలలోపు వరకు మాత్రమే స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేశారు. మిగతా వారు స్మార్ట్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కార్డులు మండలాలకు చేరినప్పటికీ వాటి పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

సాంకేతికతను జోడించి..

ఇప్పటి వరకు రేషన్‌ కార్డులు కేవలం కాగితంపైనే ప్రింట్‌తీసి ఇచ్చారు. కార్డులు పోతే తిరిగి ఆన్‌లైన్‌ సెంటర్లకు వెళ్లి కాగితాలపైనే ప్రింట్‌ తీసుకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్‌ కార్డులను రూపొందించి లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది. పాన్‌ కార్డును పోలి ఉండి క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ కార్డులను అందుబాటులోకి తెచ్చారు. కార్డుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే లబ్ధిదారుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలుస్తాయి. ఇప్పటివరకు ఈ–పాస్‌ మిషన్ల ద్వారా ఐరిష్‌, బయోమెట్రిక్‌, ఓటీపీ సాయంతో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొత్తగా అందించిన స్మార్ట్‌ కార్డులతో బియ్యం పంపిణీ ఎలా ఉంటుందోననే లబ్ధిదారుల్లో ఆసక్తి నెలకొంది.

ఫ లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీలో తీవ్ర జాప్యం

ఫ జిల్లాలో 3,71,783 రేషన్‌ కార్డులు

ఫ ఇప్పటి వరకు 10వేల లోపే పంపిణీ

ఫ మిగతా వారికి అందని కార్డులు

నత్త నడకన పంపిణీ..!

జిల్లాలో స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ నత్తనడకన సాగుతుంది. 15 ఆగస్టున ప్రారంభించినప్పటికీ నేటికీ పూర్తికాలేదు. పౌరసరఫరాలశాఖ నుంచి తహసీల్దార్లకు స్మార్ట్‌ కార్డులను అందించగా వారు రేషన్‌ డీలర్లకు అప్పజెప్పారు. లబ్ధిదారులు రేషన్‌ డీలర్ల వద్ద నుంచి వీటిని తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ జరగక పోవడంతో లబ్ధిదారులకు నేటికీ రేషన్‌ కార్డులు అందలేదు. ఈ స్మార్ట్‌ రేషన్‌ కార్డులోనూ చాలా తప్పులు ఉండగా, వాటిని ఎలా సరి చేయాలనే విషయం అధికారులకు సైతం తెలియకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement