ఎడ్యుకేషన్‌ హబ్‌గా కోదాడ నియోజకవర్గం | - | Sakshi
Sakshi News home page

ఎడ్యుకేషన్‌ హబ్‌గా కోదాడ నియోజకవర్గం

Sep 7 2026 7:27 AM | Updated on Sep 7 2026 7:27 AM

కోదాడ: కోదాడ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్‌ వద్ద రూ. 50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న నవోదయ పాఠశాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వెంటనే ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరానికి భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కోదాడ సమీపంలోని ఆకుపాముల వద్ద రూ. 10 కోట్ల వ్యయంతో న్యాక్‌ భవన పనులు కూడ వేగంగా జరుగుతున్నాయని, ఇందులో నిరుద్యోగులకు వివిధ రకాల వృత్తుల్లో స్కిల్స్‌ నేర్పిస్తామని చెప్పారు. చిలుకూరు మండల పరిధిలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల పనులు కూడా వేగంగా పూర్తి చేసి వచ్చే విద్యాసంవత్సరానికి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రాంత నిరుద్యోగులకు ఈ నెల 19న కోదాడలోని సీసీ రెడ్డి విద్యానిలయంలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించేందుకు అనుమతి వచ్చిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని అన్నారు. నియోజకవర్గ పరిఽ దిలో శాంతినగర్‌, రెడ్లకుంట వద్ద రూ. 100 కోట్లతో చేపట్టిన లిఫ్ట్‌ పనులు డిసెంబర్‌ వరకు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, ఎస్సీ నరసింహ, సీఈ నాగభూషణం, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ వంగవీటి రామారావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

లిఫ్ట్‌ పనుల పరిశీలన

కోదాడరూరల్‌ : మండలంలోని రెడ్లకుంట వద్ద పాలేరు వాగుపై రూ.55 కోట్లతో నిర్మిస్తున్న లిఫ్ట్‌ పనులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పరిశీలించారు. ఈ లిఫ్ట్‌ నిర్మాణం పూర్తయితే 5వేల ఎకరాల బీడు భూములకు సాగునీరందుతుందన్నారు.

అభివృద్ధి పనులు

వేగవంతం చేయాలి

మునగాల: కోదాడ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని ఆకుపాములలో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న ఎన్‌ఏసీ భవనం, కృష్ణానగర్‌ శివారులో ఆర్‌–9 ఎత్తిపోతల పథకంలో రూ.28కోట్లతో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్‌, ఎస్పీతో పాటు మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

19న కోదాడలో మెగాజాబ్‌ మేళా

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement