కోదాడరూరల్ : ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగిన సెకండ్ ఇన్విటేషన్ షోటో కాన్ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో కోదాడ పట్టణం శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన స్టూడెంట్ షోటో కాన్ కరాటే క్లబ్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. వారు పలు విభాగాల్లో పతకాలు సాధించినట్లు కోచ్ ఆరే మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్లబ్ విద్యార్థుల్లో భవ్య బంగారు పతకం, మాన్యభరత్ సిల్వర్, లోకేష్ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందించినట్లు తెలిపారు.


