ఫ మాజీ ఎంపీ బడుగుల
లింగయ్య యాదవ్
ఫ సూర్యాపేటలో బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ
సూర్యాపేటటౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేయడంతోపాటు విద్యార్థులను, విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులకు ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట పట్టణంలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ ఇచ్చిన మోసపూరిత హామీలు, జాబ్ క్యాలెండర్, స్కూటీలు, యూత్ డిక్లరేషన్, 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా భరోసా కార్డు ఇంకెప్పుడిస్తారని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, అంగిరేకుల నాగార్జున, అన్నపూర్ణ, బంటు సందీప్, అనిల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌వీ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
కోదాడ : విద్యార్థులకు, యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆరోపించారు. వెయ్యి రోజులు కాంగ్రెస్ వైఫల్య పాలనపై శనివారం కోదాడ బస్టాండ్ సెంటర్‌లో విద్యార్థులతో కలిసి చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. బాలికలకు స్కూటీలను ఇస్తానని హామీ ఇచ్చి మూడేళ్లవుతున్నా నేటి వరకు అందించలేదన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులతోపాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు తులం బంగారం ఇచ్చి హామీలు నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చీమ నరేష్, పలువురు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


