హుజూర్‌నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదివారం హుజూర్‌నగర్ రానున్నారని మంత్రి కార్యాలయ సిబ్బంది శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం పట్టణ శివారులోని ఫణిగిరి గుట్టవద్ద నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీ వద్ద జరగుతున్న పనులతోపాటు ఆర్‌అండ్‌బీ, ఇరిగేష్ కార్యాలయ భవన నిర్మాణాలను మంత్రి పరిశీలిస్తారని పేర్కొన్నారు. అనంతరం ముత్యాలమ్మ జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి జూనియర్, డిగ్రీ కళాశాలల భవనాలను ఆయన పరిశీలిస్తారని తెలిపారు.
విద్యార్థులు డ్రగ్స్
జోలికి వెళ్లొద్దు
చివ్వెంల(సూర్యాపేట) : విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.భవ్య అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని జీజేఎం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన డ్రగ్స్ ఫ్రీ ఇండియా–2025 కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం డ్రగ్స్ చాక్లెట్ల రూపంలో వస్తున్నాయని, విద్యార్థులు బయట తినే ఆహార పదార్థాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, కె.ప్రియదర్శిని, హెచ్‌ఎం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ఉద్యమాలను కొనసాగిద్దాం
సూర్యాపేట అర్బన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను కొనసాగిద్దామని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శని వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ధర్మభిక్షం భవనంలో ఉస్తెల నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన వీరోచిత పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సమావేశంలో యాల్లావుల రాములు, ఎల్లంల యాదగిరి, బద్దం కృష్ణారెడ్డి, బూర వెంకటేశ్వర్లు, నంద్యాల రాంరెడ్డి పాల్గొన్నారు.


