సూర్యాపేట : సూర్యాపేటకు కేంద్రం ప్రకటించిన బుల్లెట్ ట్రైన్ మొదటి అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు. శనివారం బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 23వ రోజు రిలే దీక్షలో కూర్చున్న మలిదశ ఉద్యమకారులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. దీక్షలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులు సట్టు నాగయ్య, వెలుగు వనితక్క, చకిలం రవి ప్రసాద్, మామిడి శెట్టి అంజయ్య, దొండ శ్రీను, లింగంపల్లి మురళి, ఎస్ కే సలీం, గొనె విజయ, వీరమనేని సత్యనారాయణరావు, నోముల ఉమాదేవి, అయూబ్ పాషా, దువ్వగిరి మేడబోయిన గంగయ్య,సికిందర్, దారా నిలిని, మాచర్ల రామ లక్షమ్మ,సట్టు మహేశ్వరి,కే సుజాత కూర్చోగా న్యాయవాది సత్యనారాయణ పిళ్ళై, జర్నలిస్టులు కందుకూరు యాదగిరి, ఉయ్యాల నర్సయ్య, కరాటే మాస్టర్ సయ్యద్, భయ్యా మల్లికార్జున్, చీకూరు శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు.
బుల్లెట్ ట్రైన్ సాధన కమిటీ
నేతల అరెస్టు అప్రజాస్వామికం
సీఎం రేవంత్‌రెడ్డి నకిరేకల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో శనివారం సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఆరుట్ల జానకిరెడ్డి, కోకన్వీనర్ చల్లమల్ల నరసింహను పట్టణ పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుతోపాటు ప్రజా, సామాజిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. బుల్లెట్ ట్రైన్ సాధన కోసం శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న వారిని ముందస్తుగా అరెస్టు అన్యాయమని వారు ముక్తకంఠంతో ఖండించారు.


