యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో నిండుగా కనిపించాయి. స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టగా.. వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారిని 40వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో స్వామికి నిత్యాదాయం రూ.34,39,385 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.


