యువతి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Jun 24 2023 1:20 AM | Updated on Jun 24 2023 1:46 PM

- - Sakshi

షఫియా ఇంటి వద్దనే ఉంటోంది. కాగా గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో షఫియా బ్యాగులో బట్టలు సర్దుకుని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.

హుజూర్‌నగర్‌: పట్టణంలోని దద్దనాలచెరువు కాలనీకి చెందిన యువతి అదృశ్యమైనట్లు శుక్రవారం ఫిర్యాదు అందిందని ఎస్‌ఐ వెంకటరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. దద్దనాలచెరువు కాలనీకి చెందిన షేక్‌ రిహానా, ఖాజామియా దంపతులకు కుమారుడు, కుమార్తె షేక్‌ షఫియా సంతానం.

షఫియా ఇంటి వద్దనే ఉంటోంది. కాగా గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో షఫియా బ్యాగులో బట్టలు సర్దుకుని ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా షఫియా ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం ఆమె తండ్రి ఖాజామియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement