ప్రజల సొమ్ములు.. | - | Sakshi
Sakshi News home page

ప్రజల సొమ్ములు..

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

● ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చేందుకు

ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ పాలసీ

● దాని ముసుగులో ఐటీడీపీకి లబ్ధి!

● కూటమి ప్రభుత్వం తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం

పబ్లిసిటీ

సోకులు!

ఐటీడీపీ కార్యకర్తల కోసమే..

ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి కోసం ప్రస్తావన చేయడం లేదు. ఆడబిడ్డ నిధి కోసం మాట్లాడటం లేదు. 45 ఏళ్లకే పింఛన్‌ పథకం ఊసెత్తడం లేదు. కేవలం ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సోషల్‌ మీడియా పేరుతో ఐటీడీపీ కార్యకర్తలకు కోట్లాది రూపాయలు దోచిపెట్టడానికే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల పేరుతో ప్లాన్‌ వేశారు.

– ఆట్ల రాహుల్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు, టెక్కలి

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

ఓట్లేసి గెలిపించిన ప్రజల గొంతు ఎండిపోతుంటే.. భజన చేసే సొంత అనుకూలవర్గానికి ప్రభుత్వ ఖజానా నుంచి ధన వర్షం కురిపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా స్కెచ్‌ వేసింది. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించే సరికొత్త దోపిడీకి తెరలేపింది. తమ అనుకూల సోషల్‌ మీడియా(ఐటీడీపీ) బ్యాచ్‌కు పరోక్షంగా ఆర్ధిక ప్రయోజనం చేకూర్చేందుకు ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ పాలసీ సిద్ధం చేసింది.

హామీలు గాలికి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకి రూ.1500, యాభై ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్లు, ఉద్యోగాలు వచ్చే వరకు యువతకు నెలకి రూ.3వేల నిరుద్యోగ భృతి అంటూ అట్టహాసంగా ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రభుత్వం పూర్తిగా తుంగలోకి తొక్కింది. ఇప్పటికే రాష్ట్రం తీవ్ర అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతుండగా, సంక్షేమ పథకాలకు నిధుల్లేవని సాకులు చెబుతూ కాలయాపన చేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం, రోజురోజుకి ప్రభుత్వం అప్రతిష్టపాలవుతుండటంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు సామాజిక మాధ్యమాలను అస్త్రంగా వాడుకోవాలని ప్రభుత్వం బరితెగించింది. సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయెన్సర్ల ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా నెలకు రూ.25వేల నుంచి గరిష్టంగా రూ.లక్షా 50వేల వరకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ముసుగులో ఐటీడీపీ సభ్యులకు, అనుకూల ప్రచారకులకు ప్రజాధనాన్ని జీతాల రూపంలో ధారాదత్తం చేయడానికి ఈ స్కెచ్‌ వేశారనే ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి.

మండిపడుతున్న యువత..

ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, నిరుద్యోగ భృతి అందక రాష్ట్రంలో యువత తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. అసలైన లబ్ధిదారులకు నిధులు కేటాయించకుండా, సొంత భజన బృందాలకు ప్రజాధనాన్ని దోచి పెట్టేందుకు వేసిన ఎత్తుగడపై నిరుద్యోగులు, మేధావులు ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వం తీరుపై సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement