విద్యుత్‌ శాఖకు వర్షాల దెబ్బ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ శాఖకు వర్షాల దెబ్బ

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

● 74 గ్రామాలు, 96 సబ్‌స్టేషన్లపై ప్రభావం

● 45 గ్రామాల్లో పూర్తిగా అందని విద్యుత్‌ సరఫరా

● నష్టం రూ.33.24 లక్షలుగా అంచనా

అరసవల్లి: తీవ్ర వాయుగుండం కారణంగా కురిసిన వర్షాలకు జిల్లాలో వివిధ శాఖలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత రెండు రోజుల నుంచి తుఫాను ప్రభావంతో పాటు గాలుల తీవ్రతకు జిల్లావ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇంకా పలు గ్రామాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. గురువారం వేకువజామున కళింగపట్నం–పోలాకి మధ్య తుపాను తీరం దాటడంతో ఒక్కసారిగా 60 నుంచి 70 కిలోమీటర్ల మేర గాలుల తీవ్రత ఉండడంతో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. 33/11కేవీ విద్యుత్‌ స్తంభాలు నాలుగు, 11కేవీ విద్యుత్‌ స్తంభాలు 124, ఎల్‌టీ విద్యుత్‌ స్తంభాలు 34, డీటీఆర్‌లు 34 దెబ్బతిన్నాయి. మొత్తం రూ. 33.24 లక్షలు మేర నష్టం వాటిల్లినట్టు విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ జీఎన్‌ ప్రసాద్‌ ప్రకటించారు. ఈపీడీసీఎల్‌ డైరక్టర్‌ సూర్యప్రకాష్‌రావు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు సాల్మన్‌రాజ్‌, రాజబాబు, శ్యామ్‌బాబు, ఎల్‌.మహేంద్రనాథ్‌, జనరల్‌ మేనేజర్లు మల్లికార్జునరావు, రాజ్‌కుమార్‌ తదితర బృందం గురువారం సర్కిల్‌ కార్యాలయంలో సమావేశమై సీఎండీ పృథ్వీతేజ్‌ ఆదేశాల మేరకు పలు ప్రభావిత మండలాల్లో పరిస్థితులను పరిశీలించారు. సర్కిల్‌ ఎస్‌ఈ ప్రసాద్‌ ఆధ్వర్యంలో టెక్నికల్‌ ఈఈ బయ్యన్నాయుడు, శ్రీకాకుళం, టెక్కలి, పలాస ఆపరేషన్స్‌ ఈఈలు పైడి యోగేశ్వరరావు, నర్సింహకుమార్‌, యజ్ఞేశ్వరరావు పనులను పర్యవేక్షించారు.

విద్యుత్‌ శాఖకు.. నష్టం వాటిల్లిందిలా...

విద్యుత్‌ సరఫరా ప్రభావిత గ్రామాలు 74

ఇంకా సరఫరా అందించని గ్రామాలు 45

నాన్‌ అగ్రికల్చర్‌ సర్వీసెస్‌ 2188

పునరుద్దరణ జరగాల్సిన సర్వీసెస్‌ 1405

అగ్రికల్చర్‌ సర్వీసెస్‌ (ఏజీఎల్‌) 17

పునరుద్ధరణ జరగాల్సిన సర్వీసెస్‌ 15

కూలిన వంతెన పరిశీలన

నందిగాం: మండలంలోని కొత్తగ్రహారం–జడ్యాడ మార్గంలో వర్షం ప్రభావంతో కూలిపోయిన వంతెనను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వంతెన పునర్నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు తయారుచేయాలని వంశధార అధికారులకు సూచించారు. వంతెన నిర్మాణం జరిగే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement