నేడూ భారీ వర్షాలు | - | Sakshi
Sakshi News home page

నేడూ భారీ వర్షాలు

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

కూలిన వంతెన పోలీసుల సహాయక చర్యలు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: తీవ్ర వాయుగుండం నేపథ్యంలో గురువారం కూడా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లు వేగంతో భారీ గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతు న్నారు. బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6.30గంటల వరకు జిల్లా వ్యాప్తం గా 1886.0 మి.మీ. వర్షం పడింది. సగటునా 36.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం భారీ గాలులు వీచే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనలు వాయిదా వేసుకోవాలని కోరారు.

నందిగాం: ఎడతెరిపి లేని వర్షాలకు కొత్తగ్రహారం–జడ్యాడ గ్రామాల మధ్య వంశధార ఎడమప్రధాన కాలువపై వంతెన కూలిపోయింది. 1988–89లో వంశధార కాలువపై నిర్మాణం చేసిన ఈ వంతెన ప్రమాదకరంగా ఉందని, ఏ క్షణాన్నైనా కూలిపోతుందని ‘సాక్షి’ తెలియజేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో బుధవారం కూలిపోయింది. విషయం తెలుసుకున్న తహసీల్దారు సోమేశ్వరరావు, వంశధార ఈఈ శేఖర్‌బాబు, ఎంపీడీఓ కుమార్‌పట్నాయక్‌, ఎస్‌ఐ షేక్‌మహ్మద్‌ ఆలీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

శ్రీకాకుళం క్రైమ్‌ : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం తక్షణ సహాయక చర్యలు చేపడుతోంది. బుధవారం పలుచోట్ల రహదారులపై కూలిన చెట్లు, కొమ్మలను తొలగించారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్‌ రూమ్‌, డయల్‌ 112 కు సమాచారం అందించాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement