నేలమట్టమైన ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

నేలమట్టమైన ఇళ్లు

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

ఇచ్ఛాపురం: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ఇచ్ఛాపురం పురపాలక సంఘం పరిధిలోని పురుషోత్తపురంలో దూపాన లక్ష్మి, రత్నాల లక్ష్మిలకు చెందిన రెండు రేకిళ్లు కూలిపోయాయి. ఆ సమయంలో ఇంటి యజమానులు వేరొక గదిలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.

సరుబుజ్జిలి: బురిడివలస ఎస్సీకాలనీలో బుధవారం చింతాడ శ్రీనివాసరావుకు చెందిన పురిల్లు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వర్షాల ధాటికి కూలిన సమయంలో శ్రీనివాసరావు తన బంధువుల ఇంటివద్ద కూర్చొని మాట్లాడుతున్నారు. భార్య లక్ష్మి కిరాణా దుకాణానికి వెళ్లింది. కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement