మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్‌కు 133 దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

మద్యం షాపుల లైసెన్సుల రెన్యువల్‌కు 133 దరఖాస్తులు

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లాలోని 176 మద్యం షాపుల లైసెన్స్‌ల రెన్యువల్‌కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే సమయానికి 133 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ప్రోహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌ తిరుపతి నాయుడు బుధవారం తెలిపారు. రిజర్వ్‌ కేటగిరీలో 18 షాపులకు గాను, 18 దరఖాస్తులు అందాయన్నారు. జనరల్‌ కేటగిరిలో 158 షాపులకు.. 133 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. మిగిలిన 25 మద్యం దుకాణాల లైసెన్స్‌దారులను లాటరీ పద్ధతిలో ఈనెల 30న ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement