‘ఎంఈఓ అని చెప్పినా పట్టించుకోవడం లేదు’ | - | Sakshi
Sakshi News home page

‘ఎంఈఓ అని చెప్పినా పట్టించుకోవడం లేదు’

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

మండల విద్యాశాఖాధికారినైన తాను పోలీసుల చుట్టూ పలుమార్లు తిరిగి ఫిర్యాదు చేసినా న్యాయం చేయ డం లేదంటూ సోంపేట ఎంఈఓ జి.కృష్ణంరాజు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సోంపేట మండలం రామయ్యపట్నానికి చెందిన ఎన్‌.రాజులు అనే వ్యక్తి తనకు పరిచయమై వ్యా పారం కోసం కొన్నాళ్ల కిందట రూ. 5.50 లక్షలు తన వద్ద అప్పుగా తీసుకున్నారని ఎంఈఓ పేర్కొన్నారు. మధ్యలో రూ. 2 లక్షలు ఇచ్చేసినా మిగతా డబ్బులు ఇవ్వలేదని, దీంతో పోలీసులను ఆశ్రయించానన్నారు. విషయం సోంపేట ఎస్‌ఐకు తెలియజేయగా ఎప్పుడిస్తారన్నది బాండ్‌ పేపర్‌ను మధ్యవర్తుల సమక్షంలో రాసుకోండని పంపించేశారని, సమయం ఇచ్చాక గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకపోవడంతో మళ్లీ పోలీసులను కలిసినా ఫలితం లేదని ఎంఈఓ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement