● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అర్హులకు న్యాయం చేయాలని కోరు తూ డీఎస్సీ బాధితులు, వారికి మద్దతుగా వచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు శాంతి యుతంగా ఆందోళన చేస్తుంటే టీడీపీ గూండాలు అకారణంగా దాడులకు దిగడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, డీఎస్సీ బాధితులపై దాడులు చేసి వారిని తీవ్రంగా గాయపరచడాన్ని కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశా రు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. దాడులకు దిగిన టీడీపీ గూండాలను వదిలేసి గాయాలకు గురైన వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం దారుణమని కృష్ణదాస్ అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం డీఎస్సీల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని, విద్యా శాఖమంత్రిగా ఉన్న నారా లోకేష్ డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని కృష్ణదాస్ డిమాండ్ చేశారు.
గిరిజన గ్రామంలో విష జ్వరాలు
టెక్కలి రూరల్: గిరిజన గ్రామంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మండలంలోని సవరగోపాలపురం గిరిజన గ్రామంలో ప్రజలు జ్వరాల బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా గ్రామంలోని చిన్నారు లు, పెద్దలు సైతం జ్వరంతో పాటుగా జలు బు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. గ్రామంలో అపరిశుభ్రతతో పాటు తాగునీరు సైతం బాగోలేకపోవడం వల్ల నే జ్వరాల బారిన పడుతున్నట్లు గిరిజనులు వాపోతున్నారు. జ్వరాల బారిన పడిన వారు టెక్కలి జిల్లా ఆస్పత్రితో పాటుగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఆరోగ్య సిబ్బంది గ్రామంలోకి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా ఇప్పటికి ము గ్గురు చిన్నారులతో పాటుగా మరో 10 మంది వరకు గ్రామస్తులు జ్వరంతో బాధపడుతున్న ట్లు గుర్తించారు. కిల్లాన సుచిత్ర, కిల్లాన సలోమీ, జస్సీ అనే ముగ్గురు చిన్నారులతో పాటుగా జంజీరు సువార్త, అనంతగిరి కమల తదితరులు జ్వరం లక్షణాలతో బాధపడుతున్నారు.


