● ఆలయానికి చెందాల్సిన భూముల ఎన్‌ఓసీ వెనుక రాజకీయ హస్తాలు
● భూబదలాయింపులో అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
● విలువైన భూములు కట్టబెట్టడంలో
చక్రం తిప్పిన ఈఓ ప్రసాద్
భూ
బదలాయింపు
అరసవల్లి:
అరసవల్లి భూముల వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భూబదలాయింపుల ప్రక్రియలో ‘నీకు కావల్సిన స్థలాన్నిస్తా.. నాకు కావల్సినంత ఇవ్వాలి’ అనేలా క్విడ్‌ప్రోకో వ్యవహారాలు నడిచినట్లు సమాచారం. ఆలయం అభివృద్ధి కోసం పరిసరాల్లో ఉన్న 1.22 ఎకరాల మేర ప్రైవేటు భూములను ల్యాండ్ టు ల్యాండ్ విధానంలో తీసుకునేందుకు దేవదాయ శాఖాధికారులు అన్ని ఏర్పా ట్లు చేసిన సంగతి విదితమే. ఇందులో భాగంగా తన అనుయాయులకు కీలక భూములను కేటాయించడంలో ఆలయ ఈఓ ప్రసాద్ తనదైన శైలిలో వ్యవహారాలను నడిపారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
వాటా ఇస్తే చాలు..
అరసవల్లి ఆలయ అభివృద్ధి కోసం ఆలయం చు ట్టుపక్కల ఉన్న ప్రైవేటు భూములు తీసుకుని, దానికి బదులుగా మరోచోట ఉన్న ఆలయ భూము లు ఆ యజమానులకు ఇచ్చేందుకు భూ బదలాయింపు జరిగింది. ఈ బదలాయింపులో కొందరికి బాగా విలువైన భూములు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఈ విలువైన భూములు కట్టబెట్టేందుకు కీలక అధికారి వాటాలు తీసుకున్నట్లు సమాచారం. రాజధానిలో కమిషనర్ కార్యాలయంలో ఖర్చుల పేరిట రిజిస్ట్రేషన్ సమయానికి ముందే ఒప్పందం మేరకు డబ్బులు చెల్లించాలంటూ ప్రైవేటు భూయజమానుల నుంచి ‘కలెక్షన్ కథ’ మొదలెట్టేశారు. దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ రామచంద్రమోహన్‌కు తాను ఎంత చెప్తే అంత అంటూ స్థానికంగా చక్రం తిప్పారు. అరసవల్లి ఆలయానికి తూర్పు ఈశాన్య మార్గంలో సేకరించిన భూయజమానులంతా దాదాపుగా ఆర్థికంగా స్థితిమంతులే కావడంతో ‘ఆలయం’ సెంటిమెంట్‌తో ఈ తెరవెనుక కలెక్షన్‌కు కూడా కొందరు వెనుకాడలేదు. దీంతో ఆలయ కీలకాధికారి తన పంట పండిందంటూ మరింత అత్యుత్సాహం ప్రదర్శించారు. దీనికి తోడు తనకు వెన్నంటే ఉంటూ సపర్యలు చేస్తున్న ఓ యజమానికి ఆలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇస్తామంటూ తన సొంత పనులు చేయించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆలయానికి ఎదురుగా ఉండే మరో ఇళ్లు, స్థలం వ్యవహారం ఇంకా తేలకపోవడంతో భూబదలాయింపు కొన్నింటికే పరిమితం చేసినట్టుగా తెలుస్తోంది. ‘నా పక్కింటి లో ఉన్న వారికి విలువైన చోట భూమి ఇచ్చి.. మాకు మాత్రం ఎక్కడో ఇస్తే మేమెందుకు స్థలం ఇస్తాం’ అని మరో భూ యజమాని తెగేసి చెప్పారు. దీంతో ఈ వ్యవహారం తేలదని, ఆ ఇళ్ల స్థలాలను మినహాయించి, మిగిలిన భూయజమానుల స్థలాలకు మాత్రమే బదలాయింపు ప్రక్రియ జరిగేలా ఈఓ ప్రసాద్ ఫైల్ నడిపారు. తద్వారా తనకు అందాల్సిన మొత్తంలో ఎలాంటి రాజీ పడకుండా రాష్ట్ర దేవదాయ శాఖ నుంచి భూ బదలాయింపుపై ఆమోదం కూడా వచ్చేలా కథ నడిపించారు. ఇంతలో స్వదేశ్ దర్శన్ పేరిట కేంద్ర పర్యాటక శాఖ అరసవల్లి ఆలయానికి అభివృద్ధి కోసం నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కోసం ఆలయ అవసరాల కోసం సేకరించిన భూముల ఎన్‌ఓసీపై వివాదం రేగింది. ఈ ఎన్‌ఓసీ వచ్చేస్తే ఆయా భూముల్లో ఏపీటీడీసీ ద్వారా టెండర్లు పిలిచి పలు నిర్మాణాలు చేస్తారు. అందుకే ఎన్‌ఓసీపై కలెక్టర్ రంగంలోకి దిగారు.
ఎన్‌ఓసీ వెనుక రాజకీయ పెద్దలు
ఆలయ భూములుగా రికార్డుల్లోకి ఎక్కనున్న 1.22 ఎకరాల భూములపై ఎన్‌ఓసీ ఇచ్చే విషయంలో రాజకీయ పెద్దల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. ఆలయానికి రెండేళ్ల కిందట అభివృద్ధి పేరిట ప్రసాద్ స్కీం ద్వారా రూ.100 కోట్లు వచ్చేస్తాయంటూ కింజరాపు మంత్రులు ప్రగల్భాలు పలికి రెండేళ్లయినా ఒక్కపైసా రాబట్టలేకపోవడంతో అభాసుపాలైన సంగతి తెలిసిందే. దీంతో ప్రసాద్ స్కీంకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన స్వదేశ్ దర్శన్ పథకానికై నా అరసవల్లి ఆలయ భూముల్లో పలు ని ర్మాణాలు కట్టేసి ఆ క్రెడిట్ కొట్టేసే పనిలో కూ టమి నేతలున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఆలయ భూములుగా ఉన్న 1.22 ఎకరాల భూములకు ఎన్‌ఓసి ఇచ్చేయాలంటూ ఈఓ ప్రసాద్‌పై తీవ్ర ఒత్తిళ్లు పెంచారు. దేవదాయ శాఖ చట్టం ప్రకారం ఎన్‌ఓసీ ఇచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో స్థాని కంగా ఒత్తిళ్లు తట్టుకోలేక ఆలయ ఈఓ ప్రసాద్ సెలవు మార్గం పట్టారనే చర్చ ఆలయ వర్గాల్లో జోరందుకుంది. సోమవారం ఉదయం నుంచి వివిధ రకాల పెండింగ్ బిల్లులన్నీ చేయించుకునేందుకు కాంట్రాక్టర్లు ఆలయానికి క్యూ కట్టా రు. ఇక ఆలయ అధికారి కూడా బినామీ శిష్యు ల పేర్లతో చేసిన పలు పనులకు చెందిన సామ గ్రి బిల్లులను కూడా క్లియర్ చేయించుకున్నా రని తెలిసింది.
ఆలయం ముందు పెండింగ్‌లో ఉన్న భవనం ఇదే


