చినుకు పలకరింపు | - | Sakshi
Sakshi News home page

చినుకు పలకరింపు

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: బంగాళాఖాతంలో అల్పపీడనం తుఫాన్‌గా మారింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ముందు నుంచి తుఫాన్‌ హెచ్చరికలు ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాన్‌ ప్రభావం ఉండే అవకాశం ఉన్న మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించి అందుకు కావాల్సిన చర్యలు తీసుకొంది. అధికారులు ఆయా మండలాల్లో పునరావాస కేంద్రాల గుర్తింపు, తీర ప్రాంతాల్లో అప్రమత్తం, నదీ ప్రవాహ ప్రాంతా ల్లో ముందస్తు చర్యలు తీసుకున్నారు. అయితే భారీ వర్షాలు మంగళవారం నుంచి పడనున్న ట్టు, తుఫాన్‌ బుధవారం నాటికి తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. భా రీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో జిల్లా లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలను తీసుకున్నారు. తుఫాన్‌ పునరావాస కేంద్రాల్లో మంచినీరు, ఆహారం, విద్యుత్‌, వైద్యం, పారిశుద్ధ్యంతో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు సిద్ధం చేస్తున్నా రు. విద్యుత్‌ అంతరాయాలు, రహదారులపై చెట్లు పడటం, రవాణాకు అంతరాయం వంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందేలా కంట్రోల్‌ రూ మ్‌లు, కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయం, మండలాల్లో ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో అత్య వసర సేవలను 24 గంటలు అందుబాటులో ఉంచేందుకు కంట్రోల్‌ రూం నంబర్‌ 08942 220557 ను అందుబాటులో ఉంచారు.

తుఫాన్‌గా మారిన అల్ప పీడనం

మరో మూడు రోజుల పాటు వర్షాలు

యంత్రాంగం అప్రమత్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement