ఒక్క కోతిని పట్టారు | - | Sakshi
Sakshi News home page

ఒక్క కోతిని పట్టారు

Sep 22 2026 1:12 AM | Updated on Sep 22 2026 1:12 AM

మెళియాపుట్టి: ‘వామ్మో.. వానరాలు’ పేరిట ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వారం రోజులు గా నిర్లక్ష్యం వహించిన సిబ్బంది, కథనం ప్రచురితమైన కొన్ని గంటల్లోనే కోతులను పట్టడానికి రంగంలోకి దిగారు. కానీ సోమవారం ఒక్క కోతిని మాత్రమే పట్టుకున్నారు. మరో కోతి గ్రామంలోనే తిరుగుతూ దాడులు చేస్తూనే ఉంది.

12 మందికి కిడ్నీ సమస్యలు

సంతబొమ్మాళి: సంతబొమ్మాళి పంచాయతీ తెనిగిపెంటలో 12 మందికి కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఉన్నట్లు గుర్తించామని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నందిని సోమవారం తెలిపారు. ఈ నెల 18వ తేదీ న ‘తెనిగిపెంట కిడ్నీవాధుల తంటా’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. వైద్యాధికారులు నందిని, శ్రావణి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి మూడు రోజులపాటు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి 60 మంది నమూనాలను సేకరించి పరీక్షలను నిర్వహించారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారిని పలాస కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌కు తరలించామని తెలిపారు.

భార్య కాపురానికి రాలేదని

భర్త ఆత్మహత్యాయత్నం

కాశీబుగ్గ : భార్య కాపురానికి రాలేదన్న కారణంతో భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం చినబాడాంలో చోటుచేసుకుంది. కూర్మాపు లోకనాథం, దమయంతి దంపతులు కొంత కాలం నుంచి చినబాడాంలో కాపురం ఉంటున్నారు. భార్య దమయంతి ఐదు రోజుల కిందట అదే గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. అయితే తిరిగి రాలేదు. దీంతో లోకనాథం వెళ్లి దమయంతిని పిలిచా డు. ఆమె రానంటూ నిరాకరించడంతో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నా డు. అప్రమత్తమైన స్థానికులు లోకనాథాన్ని పలాస ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అక్క డి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement