శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

న్యూస్‌రీల్‌

మహిళలకు రక్షణ కరువు

బుధవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2026

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై దాడు లు జరుగుతూనే ఉన్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం తప్ప అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలుచేయడం లేదన్నారు. చంద్రబాబుకి మహిళలంటే గౌరవం లేదని, టీడీపీకి చెందిన ఎమ్మెల్యే దాడులు చేసి మహిళల్ని వివస్త్రను చేసినా కనీసం పట్టించుకోని దౌర్భాగ్య పరిస్థితి ఉందన్నా రు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి మహిళలకు జరుగుతున్న దాడులు, అన్యాయాలు, అక్రమాలపై వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఓ వినతి పత్రం తయారు చేసి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి మంగళవారం అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణదాస్‌ మాట్లాడుతూ ఇటీవల బద్వేలు, గుంటూరుల్లో మహిళలపై ఏకంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులే దాడి చేసినా, వివస్త్రను చేసిన వీడియో బహిర్గతమైనా కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో హోమ్‌ మినిస్టర్‌గా మహిళ ఉన్నా కనీసం రక్షణ లేదన్నారు.

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురా లు, మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ ఎంవీ పద్మావతి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు అనేక రక్షణ చట్టాలు అమల్లోకి తీసుకువచ్చార ని తెలిపారు. మహిళల్ని పట్టించుకోని ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేదని, చంద్రబాబునాయుడికి ఈ సారి అదే గతి పడుతుందన్నారు.

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతి దివ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రాబందుల పాలన సాగించినట్లు ఉందన్నారు. జిల్లాలో కూన రవికుమార్‌ ఓ మహిళను వేధించి సూసైడ్‌ చేసుకునేలా చేశారని, ఓ మహిళ ఎమ్మార్వోపై చింతమనేని ప్రభాకర్‌ దాడి చేశారని ఇలా చెప్పుకుంటే పుస్తకాలుగా చెప్పవచ్చన్నారు.

గుంటూరులో ఓ మహిళపై టీడీపీ నాయకులు దాడి చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్సార్‌సీపీ యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు అన్నారు.

కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌, సీఈసీ మెంబర్‌ అంధవరపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యద ర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, వెలమ కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చల్ల అలివేలుమంగ, మహిళా విభాగం రాష్ట్రకార్యదర్శి టి.కామేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షురాలు పి.సుగుణారెడ్డి, జెడ్పీటీసీ రుప్ప దివ్య, మహిళా విభాగం నరసన్నపేట నియోజకవర్గ అధ్యక్షురాలు జీవీ రమణి, వి.మాధవిలత, జి.మానస, జి.శారద, అంబటి నిర్మల, మూకళ్ళ సుగుణ, మైలపల్లి లత, ఇచ్చాపురం మున్సిపల్‌ చైర్మర్‌ పిలక రాజ్యలక్ష్మి, బూత్‌ కమిటీ జిల్లా అధ్యక్షులు దోమ మన్మధరావు, గ్రీవెన్‌సెల్‌ జిల్లా అధ్యక్షులు రౌతు శంకరరావు పాల్గొన్నారు.

ఓ సీ్త్రని వివస్త్రను చేయడం కూటమి పాలకులకు తగదు: ధర్మాన కృష్ణదాస్‌

మహిళలపై జరుగుతున్న దాడులపై అంబేడ్కర్‌కి వినతి పత్రం అందించిన వైఎస్సార్‌సీపీ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement