శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Jul 15 2026 12:23 AM | Updated on Jul 15 2026 12:23 AM

హలో.. హలోఉద్దానంలో నెట్‌వర్క్‌ సమస్య వేధిస్తోంది. సిగ్నళ్లు రావడం లేదు. –8లో అక్కడ అనారోగ్యం కవరింగ్‌ ●

కన్నీటి నివాళి

హలో.. హలోఉద్దానంలో నెట్‌వర్క్‌ సమస్య వేధిస్తోంది. సిగ్నళ్లు రావడం లేదు. –8లో
అక్కడ అనారోగ్యం కవరింగ్‌

కాంతమ్మ మృతికి పరిహారమేదీ?

వైఎస్‌ జగన్‌ దృష్టికి

కాంతమ్మ మృతి వివరాలు

బుధవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

స్తా యూరియా కోసం వెళ్లి మహిళా రైతు కాంతమ్మ చనిపోయింది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలం పెద్దలవునిపల్లి రైతు సేవా కేంద్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఎప్పుడైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావించిందో.. లేని అనారోగ్యాన్ని కాంతమ్మకు అంటగట్టి, నిజాన్ని చంపేసే ప్రయత్నం చేశారు. రైతుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుండటంతో టీడీపీ తనకే అలవాటైన డైవర్షన్‌ పాలిటిక్స్‌ ఎంచుకుంది. రోడ్డు ప్రమాదం ఘటనను ఎంచుకుని రాజకీయం చేస్తోంది.

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్‌ యాక్సిడెంట్‌లో గొర్రెల కాపరి చనిపోయారు. ఈ ఘటన చాలా బాధాకరం. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనను రాజకీయ చేసి లబ్ధి పొందాలని టీడీపీ నాయకులు చూస్తున్నారు. ఏకంగా సీదిరి కుమారుడిపై హత్య కేసు పెట్టారు. సీదిరిని టార్గెట్‌ చేసి అరెస్టు చేయాలని రాద్ధాంతం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఏ కుటుంబానికై నా విషాదమే. బాధిత కుటుంబానికి అండగా ఉండడం, సాయం చేయడం అందరి కర్తవ్యం. కానీ దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే కుటిలత్వాన్ని టీడీపీ ప్రదర్శించింది. ఏకంగా సీదిరి కుమారుడిపై హత్య కేసు బనాయిస్తే.. కోర్టు సీరియస్‌గా మందలించడంతో సెక్షన్లు మార్చారు. అంతటితో కక్ష ఆగలేదు.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైలుకు పంపించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఆ దిశగా ఒత్తిళ్లు, రాజకీయ ఆందోళనలు చేస్తున్నారు.

ఎరువు కోసం వెళ్లి చనిపోయిన కాంతమ్మ కుటుంబాన్ని ఒక్కరు కూడా పరామర్శించలేదు. సొంత నియోజకవర్గానికి చెందిన మహిళా రైతు కాంతమ్మ కుటుంబాన్ని పరామర్శించాలన్న ఆలోచన అచ్చెన్నాయుడికి రాలేదు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్‌కూ తట్టలేదు. వాళ్లకు రాజకీయంగా ఏది లబ్ధి చేకూరుతుందో వాటిపైనే స్పందిస్తారని తాజా ఘటనతో తేట తెల్లమైంది.

రోడ్డు ప్రమాద ఘటనను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్న టీడీపీ నాయకులు

ఎరువుల కోసం వెళ్లి చనిపోయిన

కాంతమ్మను పట్టించుకోని వైనం

పైగా అనారోగ్యంతో చనిపోయారని తప్పుడు ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement