ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాడిన నాయకుడు, కాపు ఉద్యమానికి గుర్తింపుగా నిలిచిన నేత ముద్రగడ పద్మనాభం. మంచి వ్యక్తిత్వం ఉన్న ముద్రగడ లేని లోటు తీరనిది. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు అందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
– ధ ర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
సంకల్పం గొప్పది
కాపు ఉద్యమ నేత ము ద్రగడ పద్మనాభం మృతిచెందడం కాపు ఉద్యమానికి తీరనిలోటు. ఆయన సంకల్పం చాలా గొప్పది. అలాంటి నేత మన మధ్య లేకపోవడం తీరని లోటు.
– పిరియా విజయ, జెడ్పీ చైర్‌పర్సన్, శ్రీకాకుళం
పోరాటయోధుడు పద్మనాభం
రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాపు ఉద్యమానికి ఊపిరిపోసిన ముద్రగడ పద్మనాభం పోరాటయోధుడు. ఆయన సామాజిక వర్గం అణచివేతకు గురవుతోందని గొంతెత్తి చాటిన వైనం ఎప్పటికీ మర్చిపోలేనిది. అలాంటి ఉద్యమకారులు అరుదు. – నర్తు రామారావు, ఎమ్మెల్సీ
బలమైన నేత
ఏపీ రాజకీయాల్లో బలమైన నేత, కాపు ఉద్యమ నేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటు. కాపు నాయకులు ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటారు. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే
రాజీ లేని పోరాటం
కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం మంచి పేరు ప్రఖ్యా తలు గడించారు. నమ్మి న సిద్ధాంతం కోసం రాజీ లేని పోరాటం చేశారు. ఆయన మృతి కాపులకు తీరని లోటు.
– గొర్లె కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే
బాధాకరం
నిబద్ధత కలిగిన నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి ఎంతో బాధాకరం. కాపు సామాజిక వర్గానికి అండగా ఉద్యమాలు చేసిన గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం.
– పేరాడ తిలక్, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, టెక్కలి
తీరని లోటు
రాష్ట్ర కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అకాల మరణం ఆ సామాజిక వర్గంతో పాటు, ఆ ప్రాంతానికి తీరనిలోటు. కాపులకు బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఆయన చేసిన పోరాటాలు చిరకాలం గుర్తుంటాయి. ఆయన మృతికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
– సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త


