ఈగల సమస్య తగ్గుముఖం | - | Sakshi
Sakshi News home page

ఈగల సమస్య తగ్గుముఖం

Jul 14 2026 4:53 AM | Updated on Jul 14 2026 4:53 AM

టెక్కలి: మండలంలోని బూరగాం పంచాయతీ బాలకవానిపేట గ్రామంలో గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న ఈగల సమస్యకు ప్రధానమైన కారణాలపై స్పష్టత రాలేదు. అయితే గత కొద్ది రోజులుగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేస్తుండడంతో ప్రస్తుతానికి ఈగల సమస్య తగ్గుముఖం పట్టింది. ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామంలో ఈగల మోతపై గ్రామస్తులు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చెబుతున్నారు. గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి పంట పొలాల వద్ద కొంతమంది కోళ్ల వ్యర్థాలను ఎరువులుగా వినియోగించేందుకు నిల్వగా చేయడంతో ఈ సమస్య తలెత్తినట్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోళ్ల వ్యర్థాలపై ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో ఈగలు పెరిగి గ్రామంపై దాడి చేశాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా అధికారులు పరిశీలన చేసినట్లయితే భవిష్యత్‌లో బాలకవానిపేట గ్రామానికి ఈగల దాడి లేకుండా శాశ్వతమైన పరిష్కారం చూపవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement