ఉద్యోగుల సమస్యలపై ఆందోళన నేడు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమస్యలపై ఆందోళన నేడు

Jul 14 2026 4:53 AM | Updated on Jul 14 2026 4:53 AM

శ్రీకాకుళం: రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ఆందోళన చేపట్టనున్నట్లు ఏపీటీఎఫ్‌ నాయకుడు మామిడి భుజంగరావు, బుక్కురు వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఐక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకు 80 అడుగుల రోడ్డు నుంచి ర్యాలీ ప్రారంభించి, కలెక్టర్‌ కార్యాలయం వద్ద పికెటింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

శ్మశానవాటిక ఆక్రమణపై ఫిర్యాదు

రణస్థలం: మండల కేంద్రంలోని జేఆర్‌పురం పంచాయతీ దన్నానపేట గ్రామానికి చెందిన శ్మశానవాటికను కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారని గ్రామస్తులు తహసీల్దార్‌ సనపల కిరణ్‌ కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్‌ 211–1లో గెడ్డ వాగును గత 50 ఏళ్లుగా శ్మశానవాటికగా వాడుతున్నామన్నారు. ప్రస్తుతం ఆ గెడ్డవాగును కప్పేసి పంట పొలాలుగా మార్చేస్తున్నారని, శ్మశానవాటిక, గెడ్డవాగుకు హద్దులు నిర్ణయించి ఆక్రమణలు తొలగించాలని కోరారు. ఈ ఫిర్యాదు చేసినవారిలో దన్నాన లక్ష్మణరావు, దన్నాన శ్రీరామ్‌, సత్య, దినేష్‌ కుమార్‌, సాయి, తేజ తదితరులు ఉన్నారు.

ఎస్పీ గ్రీవెన్స్‌కు 88 ఫిర్యాదులు

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ (ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక)కు 88 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో పరిష్కారం అయ్యేలా చొరవ చూపుతానని భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement